ఎంటర్టైన్మెంట్.. సోషల్ మీడియాలో కావల్సినంత దొరుకుతుంది. వైరల్ వీడియోలు, ఫోటోలు, పజిల్స్, మీమ్స్.. ఇలా ఫన్ నెట్టింట కోకొల్లలు. అయితే ఫన్‌తో పాటు మీలో చురుకుదనాన్ని పెంపొందించాలంటే.. ఫోటో పజిల్స్ పర్ఫెక్ట్ ఛాయస్. సామాజిక మాధ్యమాల్లో ఇవి చాలానే ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా పేజీలు కూడా రన్ అవుతున్నాయి. అసలు ఆ ఫోటోలో ఏముంది.? ఉంటే అదెక్కడుందో తెలుసుకునేందుకు పలువురు నెటిజన్లు తగ్గేదేలే అన్నట్లు ఓ పట్టు పడుతుంటారు. పజిల్స్ ఒక లెవెల్ అయితే.. ఫోటో పజిల్స్ వేరే లెవెల్.. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. ఏదో అటవీ ప్రాంతంలా ఉన్న ఆ ప్లేస్‌లో విషసర్పం ఎంచక్కా సేద తీరుతోంది. చుట్టూ రాళ్లు.. ఆపై ఆకుపచ్చని పిచ్చిమొక్కలు కలిసి ఉండటంతో.. ఆ పామును కనిపెట్టడం కష్టం. మీ కళ్లలో పదునుంటే ఈ ఫోటో పజిల్‌ను ఫస్ట్ అటెంప్ట్‌లో సాల్వ్ చేసేయగలరు. ఈ పజిల్‌ను సాల్వ్ చేయడంలో 95 శాతం మంది ఫెయిల్ అయ్యారు. మరి మీరూ ఓసారి లుక్కేయండి. కనిపెట్టకపోతే.. సమాధానం కోసం క్రింద ఫోటోపై ఓ లుక్కేయండి.
here is the answer.. pic.twitter.com/XQ3ks8saye
— telugufunworld (@telugufunworld) February 19, 2022