AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాములు నిద్రపోతాయా..? 99శాతం మందికి తెలియని సీక్రెట్స్ ఇవే..

ప్రకృతిలో అత్యంత రహస్యమైన, ప్రమాదకరమైన జీవుల్లో పాములు ఒకటి. అయితే ఇతర జంతువుల్లా కాకుండా పాముల జీవన విధానం చాలా ప్రత్యేకం. పాములకు అసలు కనురెప్పలే ఉండవన్న సంగతి మీకు తెలుసా? మరి కనురెప్పలు మూసుకోకుండా అవి ఎలా నిద్రపోతాయి? కళ్లు తెరిచే కలలు కంటాయా లేక అసలు నిద్రకే దూరంగా ఉంటాయా? పాములను చూసినప్పుడు ప్రతి ఒక్కరి మదిలోనూ మెదిలే ఒక ఆసక్తికరమైన ప్రశ్న. దానికి సమాధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పాములు నిద్రపోతాయా..? 99శాతం మందికి తెలియని సీక్రెట్స్ ఇవే..
The Secret Sleeping Habits Of Snakes
Krishna S
|

Updated on: Oct 09, 2026 | 7:55 AM

Share

పాములు నిద్రపోతాయా? నిద్రపోతే ఎలా పోతాయి? వాటికి అసలు కనురెప్పలే ఉండవు కదా.. మరి కళ్లు తెరిచే నిద్రపోతాయా? సాధారణంగా ప్రతి ఒక్కరి మదిలోనూ మెదిలే ఆసక్తికరమైన ప్రశ్న ఇది. జీవశాస్త్ర నిపుణుల పరిశోధనల ప్రకారం.. పాములు కచ్చితంగా నిద్రపోతాయి. అయితే మనుషులు లేదా ఇతర జంతువుల్లా కాకుండా వాటి నిద్రపోయే విధానం అత్యంత విచిత్రంగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. పాములకు క్షీరదాల మాదిరిగా మూసుకునే కనురెప్పలు ఉండవు. వాటి కంటి గుడ్లపై బ్రిల్ లేదా స్పెక్టకిల్ అని పిలిచే పారదర్శకమైన, గ్లాస్ లాంటి పొర శాశ్వతంగా కప్పి ఉంటుంది. ఈ పొర కంటిని దుమ్ము, ధూళి నుంచి రక్షిస్తుంది. పాములు కళ్లు మూసుకోలేవు కాబట్టి.. అవి గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా కళ్లు తెరిచే ఉంచుతాయి. చూడటానికి అవి ఎవరినో తీవ్రంగా గమనిస్తున్నట్లు అనిపించినా, వాస్తవానికి ఆ సమయంలో అవి గాఢ నిద్రలో విశ్రాంతి తీసుకుంటుంటాయి.

పాము నిద్రపోతుందని ఎలా గుర్తించాలి?

కళ్లు తెరిచి ఉన్నప్పుడు పాము మెలకువగా ఉందో, నిద్రలో ఉందో గుర్తించడం సాధారణ ప్రజలకు కొంచెం కష్టమే. కానీ నిపుణులు కొన్ని స్పష్టమైన లక్షణాల ద్వారా దీనిని గుర్తిస్తారు.

నాలుక కదలికలు ఆగడం: పాములు పరిసరాలను పసిగట్టేందుకు నిరంతరం తమ చీలిక నాలుకను బయటకు తీసి గాలిని వాసన చూస్తుంటాయి. నిద్రలోకి జారినప్పుడు వాటి నాలుక కదలికలు పూర్తిగా ఆగిపోతాయి.

స్థిరమైన శరీర భంగిమ: శరీరాన్ని గుండ్రంగా చుట్టుకుని , తలను శరీరం మధ్యలో లేదా నేలపై వాల్చి గంటల తరబడి నిశ్చలంగా ఉండిపోతాయి.

శ్వాస వేగం తగ్గడం: నిద్రపోతున్న సమయంలో వాటి శరీర జీవక్రియల రేటు మందగించి, శ్వాస చాలా నిదానంగా సాగుతుంది.

రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతాయి?

పాములు సాధారణంగా రోజుకు 16 గంటల వరకు నిద్రపోగలవు. ముఖ్యంగా ఏదైనా పెద్ద జంతువును లేదా వేటను మింగిన తర్వాత ఆ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి చాలా శక్తి అవసరమవుతుంది. అటువంటి సమయాల్లో అవి రోజుల తరబడి, కొన్నిసార్లు వారాల పాటు కదలకుండా ఒకేచోట నిద్రపోతూ ఉంటాయి. ఇక చలికాలంలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయినప్పుడు శీతల రక్త జంతువులైన పాములు బ్రూమేషన్ అనే నిద్రావస్థలోకి వెళ్తాయి. ఇది నెలల తరబడి సాగే ఒక రకమైన శీతాకాల నిద్ర.

నిద్రలో ఉన్న పాము ప్రమాదకరమేనా?

పాములకు బాహ్య చెవులు ఉండవు. కానీ నేల ద్వారా వచ్చే చిన్నపాటి ప్రకంపనలను సైతం వాటి దవడ ఎముకల ద్వారా స్పష్టంగా గ్రహించగలవు. కాబట్టి అవి నిద్రలో ఉన్నప్పటికీ.. సమీపంలో అడుగుల చప్పుడు లేదా భారీ కదలికలు వస్తే క్షణాల్లో మేల్కొంటాయి. నిద్రపోతున్న పామును చచ్చిపోయిందని భ్రమపడి తాకడానికి ప్రయత్నిస్తే అది ఆత్మరక్షణ కోసం ఒక్కసారిగా కాటు వేసే ప్రమాదం ఉందని వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Follow Us
పాములు నిద్రపోతాయా..? 99శాతం మందికి తెలియని సీక్రెట్స్ ఇవే..
పాములు నిద్రపోతాయా..? 99శాతం మందికి తెలియని సీక్రెట్స్ ఇవే..
ఒక్కప్పుడు తెలుగు కుర్రాళ్ల క్రష్.. ఇప్పుడు ఊహించని విధంగా..
ఒక్కప్పుడు తెలుగు కుర్రాళ్ల క్రష్.. ఇప్పుడు ఊహించని విధంగా..
టీమిండియాలో చోటు కోసం జైస్వాల్ కీలక నిర్ణయం..!
టీమిండియాలో చోటు కోసం జైస్వాల్ కీలక నిర్ణయం..!
శుక్రవారం ఒక్క రోజే 14 సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్..
శుక్రవారం ఒక్క రోజే 14 సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్..
రైతులకు కేంద్రం సూపర్ న్యూస్.. అకౌంట్లోకి రూ.5 లక్షలు పొందవచ్చు..
రైతులకు కేంద్రం సూపర్ న్యూస్.. అకౌంట్లోకి రూ.5 లక్షలు పొందవచ్చు..
ఉసిరి vs నిమ్మకాయ.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
ఉసిరి vs నిమ్మకాయ.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
తుది జట్టులోకి చోటు కోసం గట్టిగానే ఇచ్చిపడేసిన బుడ్డోడు..!
తుది జట్టులోకి చోటు కోసం గట్టిగానే ఇచ్చిపడేసిన బుడ్డోడు..!
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?