ఇది సోషల్ మీడియా యుగం. ప్రజంట్ అన్ని జనరేషన్స్ వాళ్లు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. వీటిని సాల్వ్ చేసేందుకు చాలామంది ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కొంతమంది పజిల్ కనబడితే చాలు.. దాని అంతు చూడకుండా వదిలిపెట్టరు. పజిల్స్ వాస్తవంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. మెదడుకు కాస్తంత మేతగా కూడా ఉపయోగపడతాయి. అయితే పజిల్స్ అంటే వీకెండ్ బుక్స్, మ్యాగ్‌జైన్స్‌లో వచ్చేవి మాత్రమే కాదు. ఫోటో పజిల్స్ కూడా ఉంటాయి. ‘ఈ చిత్రంలో ఏయే జంతువులు ఉన్నాయి’.. ‘ఈ ఫోటోలో జంతువును కనిపెట్టండి’.. లాంటి ఫోటో పజిల్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. వీటిని సాల్వ్ చేయడం అంత ఈజీ మాత్రం కాదండోయ్. వీటి లెక్క తేల్చాలంటే.. మీ చూపుల్లో పవర్ ఉండాది. బుర్రలో పదును ఉండాలి. లేదంటే ఇవి మిమ్మల్ని ఆడేసుకుంటాయి. చాలా సమయం స్పెండ్ చేసినా కూడా చిక్కుముడిలాగే అనిపిస్తాయి. కొన్ని కొన్ని సార్లు.. గుర్తించలేక చిరాకు కూడా వస్తుంది. అయితే సదరు ఫోటోలోని జంతువును లేదా వస్తువును కనిపెడితే.. అదో రకమైన సంతృప్తిగా ఉంటుంది. అయితే ఫోటో పజిల్స్‌ను అందించేందుకు పలు సోషల్ మీడియా పేజెస్ కూడా అందుబాటులో ఉన్నాయ్. సదరు పేజీలకు లైక్ చేస్తే చాలు.. ఎన్నో ఫోటో ఫజిల్స్ మీ ముందు ఉంటాయ్.
తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అక్కడి బురద రంగులో అది ఇమిడిపోయింది. దాన్ని కనిపెట్టడం అంత సులువు మాత్రం కాదండోయ్. ఎందుకంటే.. నూటికి 80 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో విఫలమయ్యారు. ఫోటోలోని పామును కొద్ది నిమిషాల్లో కనిపెట్టారంటే మీరు గ్రేట్ అని ఒప్పుకోవాలి. మీ చూపుల్లో ఎంత పదును ఉందో తెలియాలంటే ఈ పజిల్ సాల్వ్ చేయండి. లేదంటే కింద ఫోటోను చూడండి.
Also Read: Akhanda Collection: సరైన సినిమా పడితే బాలయ్య స్టామినా ఇది.. కలెక్షన్ల ఊచకోత.. వన్ వీక్ రిపోర్ట్
“ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు?” అడిగిన వధువు.. వరుడి ఆన్సర్ వింటే షాకే