Viral Photo: తగ్గేదేలే.! ఈ ఫోటోలోని పామును కనిపెడితే మీరే గ్రేట్.. మైండ్ బ్లాంక్..

|

Mar 10, 2022 | 9:24 PM

వర్క్‌లోడ్ నుంచి కాస్త రిలీఫ్ పొందేందుకు చాలామంది వెబ్ సిరీస్‌లు, గేమ్స్ ఆడుతుంటారు. అలా చేయడం కూడా మన మైండ్‌కు మంచిదే...

Viral Photo: తగ్గేదేలే.! ఈ ఫోటోలోని పామును కనిపెడితే మీరే గ్రేట్.. మైండ్ బ్లాంక్..
Snake 11
Follow us on

వర్క్‌లోడ్ నుంచి కాస్త రిలీఫ్ పొందేందుకు చాలామంది వెబ్ సిరీస్‌లు, గేమ్స్ ఆడుతుంటారు. అలా చేయడం కూడా మన మైండ్‌కు మంచిదే. అయితే కొంతమంది మాత్రం టైం పాస్ చేసేటప్పుడు మెదడుకు మేత వెయ్యాలని అనుకుంటారు. అందుకే పజిల్స్ లేదా పద సంపత్తిని ఒక పట్టు పడుతుంటారు. అయితే ఈ మధ్యకాలంలో నెటిజన్లను సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ బాగా ఆకర్షిస్తున్నాయి. మాములు పజిల్స్ కంటే.. ఇవి కొంచెం కష్టం లెండి.. మన కళ్ళను మభ్యపెడుతుంటాయి. పైకి కనిపించేది ఒకటి.. లోపల మరొకటి ఉంటుంది. అసలు అందులో ఏ జంతువు దాగుందో కనిపెట్టందుకు నెటిజన్లు బుర్ర పట్టుకుంటారు. ఈ ఫోటో పజిల్స్‌ సామాజిక మాధ్యమాల్లో కోకొల్లలు. వీటి కంటూ ప్రత్యేక పేజీలు  కూడా ఉన్నాయి. ఇక ఫోటో పజిల్ సాల్వ్ చేయాలంటే.. మీ మెదడుకు పదును పెట్టడమే కాదు.. కళ్ళు కూడా షార్ప్‌గా పని చేయాలి. అప్పుడే చిటికెలో సాల్వ్ చేయగలరు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి ఓ అటవీ ప్రాంతంలా ఉన్న ఆ ఏరియాలో విషసర్పం ఎంచక్కా సేద తీరుతోంది. దాన్ని మీరు గుర్తించాలి. ఈ పజిల్‌ను సాల్వ్ చేసేందుకు నెటిజన్లు బుర్ర పట్టుకుంటున్నారు. కొంతమంది అందులో పాము ఎక్కడుందో కనిపెట్టలేక చేతులెత్తేయగా.. మరికొందరు ఇందులో పాము ఏం లేదు.. ఇది భ్రమ మాత్రమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరూ ఓసారి ట్రై చేయండి. మీ కళ్లకు పదునుపెట్టండి.. చిటికెలో కనిపెట్టండి.. లేదంటే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి.