Trending: గిఫ్ట్ అంటే ఇలా ఉండాలి.. కూతురి కోసం ఏకంగా.. ఈ తండ్రి చేసిన పనికి అందరూ..

|

Dec 18, 2022 | 7:32 AM

పెళ్లంటే ఓ సందడి వాతావరణం. చుట్టాలు, బంధువులతో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక అమ్మాయి ఇళ్లల్లో పెళ్లి అంటే.. ఆ హడావుడే వేరు. పెళ్లి కూతురుని ముస్తాబు చేయడం నుంచి మండపానికి తీసుకెళ్లడం,...

Trending: గిఫ్ట్ అంటే ఇలా ఉండాలి.. కూతురి కోసం ఏకంగా.. ఈ తండ్రి చేసిన పనికి అందరూ..
Marriage Gift
Follow us on

పెళ్లంటే ఓ సందడి వాతావరణం. చుట్టాలు, బంధువులతో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక అమ్మాయి ఇళ్లల్లో పెళ్లి అంటే.. ఆ హడావుడే వేరు. పెళ్లి కూతురుని ముస్తాబు చేయడం నుంచి మండపానికి తీసుకెళ్లడం, మాంగళ్యధారణ నుంచి అప్పగింతల వరకు అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా, వేడుకగా చేస్తారు. అయితే పెళ్లిలో గిఫ్ట్ లు ఇచ్చుకోవడం కామన్ పాయింట్. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తే తమ పిల్లలపై తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమను చూపిస్తుంటారు. వారికి ఏదైనా వాహనాన్ని బహుమతిగా ఇస్తుంటారు. బైక్, కార్.. ఇలాంటివన్నమాట. మన దగ్గర అయితే కోస్తాలో సారె పెట్టడం చాలా స్పెషల్. విభిన్న వంటలు, పండ్లు, స్వీట్లు, సామాన్లతో కలిపి పెట్టే సారె తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాధాన్యత సాధించుకుంది. అయితే ఉత్తర ప్రదేశ్ లో ఓ వ్యక్తి.. తన కుమార్తెకు కూడా ఇలాంటి సారె లాంటి గిఫ్టే ఇచ్చాడు. అతను ఏం ఇచ్చాడో తెలిస్తే మీరు ముక్కు మీద వేలేసుకోవడం పక్కా.

ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో వధువు తండ్రి.. ఆమెకు కారో, బైకో ఇవ్వకుండా.. ఏకంగా బుల్డోజర్ ఇచ్చారు. దీంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. అంతే కాకుండా ” బుల్‌డోజర్ కరేగా కామ్, మేరీ బేటీ పాయేగీ దామ్” అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. అంటే బుల్డోజర్ పని చేస్తే తన కూతురు సంపాదిస్తుందని అర్థం. ఈ విషయం తెలుసుకున్న అక్కడున్న వారందరూ ఆ తండ్రిని ప్రశంసల్లో ముంచెత్తారు. కేవలం భర్త సంపాదన మీదనే ఆధారపడకుండా స్వయంగా పని కల్పించిన అతనిని మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి