ఘోర ప్రమాదం..యువకుడి కంటిలోకి దూసుకెళ్లిన బైక్‌ బ్రేక్‌ హ్యాండిల్‌.. డాక్టర్లు ఏం చేశారంటే..

|

Apr 13, 2024 | 10:49 AM

ప్రమాదానికి గురైన యువకుడిపై తీసిన స్కానింగ్ కాపీ ఫోటోలను వైద్యులు షేర్‌ చేశారు. అది అతని కనుబొమ్మను కొన్ని మిల్లీమీటర్ల దూరం నుంచి ఎలా మిస్ అయిందో వారు వెల్లడించారు. ప్రమాదంలో యువకుడి కంటికి బ్రేక్ హ్యాండిల్ తగలడంతో బైక్‌ నుంచి హ్యాండిల్‌ను కోసి వేరుచేశారు.. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునేలోపుగా

ఘోర ప్రమాదం..యువకుడి కంటిలోకి దూసుకెళ్లిన బైక్‌ బ్రేక్‌ హ్యాండిల్‌.. డాక్టర్లు ఏం చేశారంటే..
CT scan image of the boy's eye socket
Follow us on

ఓ ఘోర ప్రమాదంలో బైక్ బ్రేక్ హ్యాండిల్ 19 ఏళ్ల కుర్రాడి కంటిలోకి చొచ్చుకుపోయింది. ఎంతో శ్రమించిన వైద్యులు అతి కష్టమైన ఆపరేషన్‌ నిర్వహించి కంటిలో దిగిన బ్రేక్ హ్యాండిల్‌ను విజయవంతంగా తొలగించారు. ఈ ఘటన మలేషియాలో చోటుచేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ ఈ యువకుడి కంటిచూపుకు ఎలాంటి ఇబ్బంది, లోపం లేకుండా బయటపడ్డాడు. కొన్ని మిల్లీమీటర్ల దూరంతో బ్రేక్ హ్యాండిల్ కంటిగుడ్డుకు తగలకుండా ఆ యువకుడు తప్పించుకున్నాడు.

అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీ కేస్‌లో ప్రమాదానికి గురైన యువకుడిపై తీసిన స్కానింగ్ కాపీ ఫోటోలను వైద్యులు షేర్‌ చేశారు. అది అతని కనుబొమ్మను కొన్ని మిల్లీమీటర్ల దూరం నుంచి ఎలా మిస్ అయిందో వారు వెల్లడించారు. ప్రమాదంలో యువకుడి కంటికి బ్రేక్ హ్యాండిల్ తగలడంతో బైక్‌ నుంచి హ్యాండిల్‌ను కోసి వేరుచేశారు.. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునేలోపుగా ఆ యువకుడి కన్ను ఎర్రగా, బాగా వాచిపోయింది. బ్రేక్ హ్యాండిల్ అతని ఐబాల్ దగ్గర కుడి కన్నులో పొడుచుకుపోయింది. కానీ, ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఆ హ్యాండిల్‌ రాడ్‌ ఐబాల్‌కు తగలలేదు.. కానీ కంటి రెటీనా దెబ్బతిందని వైద్యులు తెలిపారు.

కంటి పరిస్థితిని పూర్తిగా స్కానింగ్ చేసిన తర్వాత.. బాలుడి రెటినాస్ కూడా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. 17 సెం.మీ పొడవు గల బ్రేక్ హ్యాండిల్ ముక్కు చుట్టూ ఉన్న ఎముక భాగాన్ని దెబ్బతీసింది. అలాగే ECGతీయగా అతని హృదయ స్పందన నిమిషానికి 45 నుండి 48 మాత్రమే ఉంది. దీంతో అతడి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని చెప్పిన డాక్టర్లు.. వెంట వెంటనే చికిత్స మొదలుపెట్టారు. అతని కంటిలో గుచ్చుకున్న బ్రేక్ హ్యాండిల్‌ను తొలగించడానికి ఎంతో కష్టమైన ఆపరేషన్‌ చేశారు.  అదృష్టవశాత్తు ఆ యువకుడు పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..