ఎవడి పిచ్చి వాడికి ఆనందం అని ఇందుకే అంటారేమో. ఆ మధ్య ఓ జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి.. తనకు కుక్కలా బ్రతకాలనుందని లక్షలు పోసి కుక్క కస్ట్యూమ్స్ తయారు చేయించుకున్నాడు. రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు. ఇప్పడు ఈ కుక్క బ్రతుకు నాకొద్దు బాబోయ్ అంటూ.. ఆ వేషం తీసేయడానికి రెడీ అవుతున్నాడట. ఇటీవల ఓ బ్రిటన్ టాబ్లాయిడ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టోకో అనే ఈ వ్యక్తి తను కుక్కలా బతకడం వల్ల తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధవులు ఏమనుకుంటున్నారో అనే ఫీలింగ్ తనను నిద్రపోనివ్వడంలేదట. దాంతో ఆ వేషానికి ఎండ్‌కార్డ్ వేద్దామని డిసైడ్ అయ్యాడట. ఇదిలా ఉంటే.. అదే జపాన్‌లో ఇంకో వ్యక్తి తనకు తోడేలులా ఉండాలనుందంటూ డబ్బు కుమ్మరించాడు. ఏకంగా 19 లక్షల రూపాయలు పైనే ఖర్చుచేసాడు.
టోకో కోసం కుక్క కాస్ట్యూమ్స్ చేసిన జెప్పెట్ అనే కంపెనీయే ఈ తోడేలు సూట్ కూడా తయారుచేసిందట. అయితే ఇక్కడ వీడి బాధేంటంటే తను తోడేలులా నాలుగు కాళ్లతో నడవలేకపోతున్నాడట. అందుకని రెండుకాళ్లతోనే నడుస్తూ.. తన కల నెరవేరిందని చంకలు గుద్దుకుంటున్నాడు. ఇది చూసి నెటిజన్స్.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదే.. ఒకరిని చూసి మరొకరు ఇలా తయారు అవుతున్నారంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.
Remember the Japanese man who spent Rs 12 lakh to look like a #dog?
Another Japanese man has wished for a hyper-realistic #wolf costume. He said – “Because of my love for animals since childhood & some realistic animal suits appearing on TV, I dreamed of ‘being one someday’.” pic.twitter.com/ZrtKvhh31k
— Mirror Now (@MirrorNow) December 31, 2022
ఇదిలా ఉంటే ఆ కంపెనీకి మరిన్ని జంతువుల ముసుగులు కావాలంటూ ఆర్డర్‌లు పెడుతున్నారంట ఇదంతా చూస్తున్న వాళ్లు. అందుకే అన్నారు.. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అని.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..