Viral News: భారీ మొసలిని చుట్టేసి అమాంతం మింగేసిన కొండ చిలువ… వామ్మో..!

ఆకలి వేస్తే చాలు ఎదురుగా ఉంది ఎంత పెద్ద జంతువునా సరే అమాంతం మింగి  అరిగించేసుకుంటుంది కొండచిలువ. ఇక నీటిలో ఉంటే...

Viral News: భారీ మొసలిని చుట్టేసి అమాంతం మింగేసిన కొండ చిలువ... వామ్మో..!
Python Vs Crocodile

Updated on: Jul 25, 2021 | 6:30 PM

ఆకలి వేస్తే చాలు ఎదురుగా ఉంది ఎంత పెద్ద జంతువునా సరే అమాంతం మింగి  అరిగించేసుకుంటుంది కొండచిలువ. ఇక నీటిలో ఉంటే అడవికి రాజైన సింహాన్నైనా వేటాడేస్తుంది మొసలి.  ఈ రెండు ప్రమాదకర జీవులే. బలం విషయంలో కూడా ఇవి రెండూ సమఉజ్జీలే. ఇలాంటి రెండు ప్రమాదకర జీవులు ఒకదానికి ఒకటి ఎదురైతే ఎట్టా ఉంటుంది అన్నది అత్యంత ఆసక్తికర విషయం. అయితే అలాంటి దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లోని ఈసా పర్వత ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో కయకెర్ మార్టిన్ అనే వ్యక్తి ఓ నదీ తీరంలో మొసలి, కొండ చిలువలు పోట్లాడుకుంటున్న ఫోటోలు తీశాడు. ఫోటోలను గమనిస్తే.. కొండచిలువ ఆ మొసలిని కదలకుండా చుట్టేసింది. అక్కడ నీరు కూడా పెద్దగా లేకపోవడంతో మొసలి చేతులెత్తేసింది. దీంతో కొండచిలువ దాన్ని అమాంతంగా మింగేసింది. ఈ పోరాటంలో గెలిచిన కొండచిలువ అలవోకగా మొసలిని ఆహారంగా మలుచుకుంది. మొసలి తన ప్రాణాలను రక్షించుకోడానికి ఎంత ప్రయత్నించినా.. కొండచిలువ పట్టు ముందు దాని ప్రయత్నం సఫలీకృతం అవ్వలేదు. దీంతో కొండచిలువ దాన్ని పూర్తిగా మింగేసి దర్జాగా వెళ్లిపోయింది. ఈ ఫొటోలను ‘సీజీ వైల్డ్ లైఫ్ రెస్క్యూ’ సంస్థ తమ ఫేస్‌బుక్ పేజీలో 2019లో పోస్ట్ చేసింది. అనూహ్యంగా ఆ ఫోటోలు ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతున్నాయి. ఒళ్లు గగుర్పాటు కలిగించే ఆ దృశ్యాలను దిగువన చూడండి.

Also Read: Viral Video: చిరుతను మింగేందుకు ఎగబడి వచ్చిన కొండ చిలువ.. చివరికి షాకింగ్ సీన్

Aliens: ఏలియన్స్‌ రక్తం ఏ రంగులో ఉంటుందో తెలుసా? ఆసక్తికర విషయాలు