Viral Video: “మేమే ముందు.. కాదు మేమే ముందు”.. పెళ్లి ముహూర్తం గురించి గుడిలో రెండు కుటుంబాల ఫైట్

|

Aug 23, 2021 | 8:02 AM

చిన్న విషయం చినికి చినికి గాలివానగా మారింది. దీంతో దేనికోసం వచ్చామో కూడా మర్చిపోయి వారు గొడవకు దిగారు. దీంతో ఆ ఆలయంలో...

Viral Video: మేమే ముందు.. కాదు మేమే ముందు.. పెళ్లి ముహూర్తం గురించి గుడిలో రెండు కుటుంబాల ఫైట్
Temple Fight
Follow us on

చిన్న విషయం చినికి చినికి గాలివానగా మారింది. దీంతో దేనికోసం వచ్చామో కూడా మర్చిపోయి వారు గొడవకు దిగారు. దీంతో ఆ ఆలయంలో చాలాసేపు టెన్షన్ నెలకొంది. తాళి ఎవరు ముందుగా కట్టాలి అనే వివాదంలో పెళ్ళికొడుకులు, పెళ్లికూతుర్లతో సహా రెండు కుటుంబాలు పిడిగుద్దులు కురిపించుకున్నారు. తమిళనాడులోని మురుగన్ ఆలయం పిడిగుద్దులతో మారుమోగింది. పెళ్లిళ్ల విషయంలో తలెత్తిన వివాదం.. చినికి చినికి గాలివానగా మారింది. కొట్లాటకు దారి తీసింది. చెన్నై శివారు కుండ్రతుర్‌ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కొత్త జంటలు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం పోటెత్తింది. శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్లు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే, ఒక్కో వివాహనికి ఇచ్చిన సమయం కేవలం అరగంట. ఆ అరగంటలో పెళ్లి పూర్తవ్వాలి.

అయితే, జంటలతో పాటు వారి కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో రావడంతో ముహూర్తాలు ఆలస్యమయ్యాయి. దీంతో ముందు మా పెళ్లి జరగాలంటే.. మా పెళ్లి జరగాలంటూ వాగ్వాదాలు, ఘర్షణలకు దిగారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికారులు ఎంత వారించినా వినిపించుకోకపోవడంతో టెన్షన్.. టెన్షన్‌ నెలకొంది. పెళ్లి వేడుకల్లో వధూవరులతో సహా బంధువులు కొట్టుకోవడం వైరల్‌గా మారింది.

దేవాదాయ శాఖ అధికారులు ఎంత వారించినా పెళ్లిళ్లు చేసుకోవడానికి వచ్చిన వారు అస్సలు వినలేదు. వివాహ వేడుకలలో భక్తులు కొట్టుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై ఆలయ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నిబంధనలు పాటించకుండా పిడి గుద్దులకు దీగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

గొడవకు సంబంధించిన వీడియో దిగువన చూడండి

Also Read: అతివలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా అదే బాటలో

విద్యార్థినులు, మహిళలు దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని హీరో అడవి శేష్ పిలుపు