పాము కనిపిస్తే.. కొంచెం భయం వేసినా ఏ కర్ర పట్టుకుని కొట్టి చంపడమో.. చప్పుడు చేసి బెదిరించి పంపేయడమో చేస్తాం. కానీ కొండచిలువ కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.! ఒక్క క్షణం గుండె ఆగినంత పనవుతుంది. సరిగ్గా ఇదే పరిణామం ఒక మహిళకు ఎదురైంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ కిచెన్‌కు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసేందుకు దగ్గరలోని సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. పచ్చళ్ల సెషన్‌లో షాపింగ్ చేస్తుండగా సుమారు 10 అడుగుల పొడవున్న కొండచిలువ ఎదురుపడింది. ఆ మహిళ షాపు యజమానికి చెప్పింది. దీనితో అతడు వన్యప్రాణి సంరక్షణ విభాగానికి సమాచారం అందించాడు. అయితే ఈలోపే అక్కడున్న మిగిలినవారు ఆ కొండచిలువను వీడియోలు తీయడంతో.. అవి కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
కాగా, సమాచారం అందుకున్న వెంటనే వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది అక్కడికి చేరుకొని కొండచిలువను బంధించారు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చోటు చేసుకుంది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!
Also Read:
ఉదయాన్నే టిఫిన్‌లో ఈ 5 ఆహార పదార్ధాలు అస్సలు తినొద్దు.. తస్మాత్ జాగ్రత్త.! అవేంటంటే..
ఈ నాలుగు రాశులవారు ప్రేమించినవారిని కష్ట సమయాల్లో ఒంటరిగా వదిలిపెట్టరు.. అందులో మీరున్నారా?