Viral Video: నువ్వే ఈత కొడతావా..? నేను కొట్టకూడదా.. యజమానికి చుక్కలు చూపించిన శునకం..

|

Jul 07, 2022 | 6:26 PM

ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో "buitengebieden" ఖాతా నుంచి అప్‌లోడ్ చేశారు. వీడియోలో కుక్క చేసిన హడావుడి చాలా ఫన్నీగా ఉంది. ఈ ఫన్నీ వీడియోను ఇప్పటివరకు..

Viral Video: నువ్వే ఈత కొడతావా..? నేను కొట్టకూడదా.. యజమానికి చుక్కలు చూపించిన శునకం..
Dog Viral Video
Follow us on

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. ఇందులో కొన్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్ని షాక్ ఇస్తుంటాయి. ఇందులో ముఖ్యంగా జంతువుల వీడియోలకు ప్రథమ స్థానం ఉంటుంది. జంతువుల వీడియోలను నెటిజన్లు ఎంతో ఇష్టపడుతుంటారు. ఈ మేరకు నెట్టింట్లో తెగ షేర్ చేస్తూ, కామెంట్ల వర్షం కురిపిస్తుంటాయి. తాజాగా ఓ కుక్క చేసిన హంగామాతో యజమానికి ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నాడు. కుక్కలు చాలా అమాయకంగా ఉంటాయి. తమ చేష్టలతో ఒక్కోసారి విసుగు తెప్పించినా.. కొన్నిసార్లు ఎంతో ముద్దుగా అనిపిస్తుంటాయి. మరికొన్నిసార్లు పిల్లల్లాగే మొండిగా ప్రవర్తిస్తుంటాయి. ఏదైమైనా ఇలాంటి చేష్టలు చూసేవారితోపాటు యజమానులకు నవ్వు తెప్పిస్తుంటాయి. ఈ కోవకే చెందిన ఓ కుక్క వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది.

సోషల్ మీడియా ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో, ఒక వ్యక్తి టబ్‌లో ఈత కొడుతున్నాడు. అయితే, కుక్క కూడా ఈత కొట్టేందుకు ఎంతో ఉత్సాహంగా ఉంది. అయితే, కుక్క యజమాని ఎన్నిసార్లు తొట్టి బయట పడేసినా.. ఈత కొట్టేందుకే కుక్క మొగ్గు చూపుతూ, పదే పదే యజమానికి చుక్కలు చూపిస్తుంది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కుక్క చేసిన పనికి నెటిజన్లు, ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో “buitengebieden” ఖాతా నుంచి అప్‌లోడ్ చేశారు. వీడియోలో కుక్క చేసిన హడావుడి చాలా ఫన్నీగా ఉంది. ఈ ఫన్నీ వీడియోను ఇప్పటివరకు కోటి (10 మిలియన్ల వీక్షణలు) కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. 283k వినియోగదారులు ఈ వీడియోను ఇష్టపడగా, 37k వినియోగదారులు వీడియోను రీట్వీట్ చేశారు.