Viral: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా ఏదో అలికిడి.. వెలికితీసి చూడగా
ఓ ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా.. కూలీలకు నేలలో ఏదో అలికిడి వినిపించింది. అది ఏంటని తవ్వి చూడగా.. ఓ భారీ అనుమానస్పద వస్తువు బయటపడింది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అతడు ఆ ఇల్లు కొనుగోలు చేసి నెల గడుస్తోంది. ఇంటిని రినోవేట్ చేద్దామనుకున్నాడు. ఆ పనుల్లో భాగంగానే కూలీలను మాట్లాడుకుని.. తవ్వకాలు జరిపాడు. కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం తవ్వుతుండగా ఏదో అలికిడి వినిపించింది. ఏమై ఉంటుందోనని వెలికితీసి చూడగా.. ఓ భారీ వస్తువు బయటపడింది. అదేంటంటే..
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర చెన్నైలోని ఓ ఇంట్లో అనుమానస్పద లోహపు వస్తువు ఒకటి బయటపడింది. ఒక ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా ఈ వస్తువు బయటపడటంతో.. అది చెక్కుచెదరని బాంబ్ షెల్ అని గుర్తించడంతో స్థానికంగా భయాందోళనలు రేకెత్తించాయి. చెన్నైలోని మన్నాడి ప్రాంతంలో ఈ వస్తువును గుర్తించారు. ముస్తఫా అనే వ్యక్తి ఈ ఇంటిని కొనుగోలు చేయగా.. కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఒక అనుమానాస్పద లోహ వస్తువు కనిపించిందని తెలిపాడు. గోడ నిర్మించడానికి భూమిని తవ్వుతుండగా ఇది దొరికిందని చెప్పాడు.
“గత నెలలో నేను ఇంటిని రిజిస్టర్ చేసాను. అది పాతది కాబట్టి, పునరుద్ధరణ పనులు చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ స్థలంలో తవ్వుతున్న ఒక తాపీ మేస్త్రీ ఈ లోహపు వస్తువును గుర్తించాడు. అది ఏంటని మాకు తెలియలేదు. దాన్ని శుభ్రం చేసి ఇంటికి తీసుకెళ్లాను. తర్వాత గూగుల్‌లో వెతకగా, అది ఒక రకమైన బాంబు షెల్ అని గుర్తించాను. ఆపై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాను” అని ముస్తఫా అన్నాడు. సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ స్క్వాడ్ సదరు ప్రాంతానికి చేరుకున్నారు. ఆ బాంబ్ షెల్‌ను జాగ్రత్తగా భద్రపరిచి.. తదుపరి దర్యాప్తు కొనసాగించారు మరికొన్ని నిద్రాణమైన బాంబులు పాతిపెట్టబడి ఉన్నాయో.. లేదో.. డిటోనేటర్ ద్వారా చెక్ చేశారు.
