Summer Air cooler: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజగా.. దేశీ జుగాడ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా భారత్ దేశీ జుగాడ్‌కు ప్రసిద్ధి చెందింది. ప్రతిభ ఎవరి సొంతం కాదన్న.. సంఘటనలు, సన్నివేశాలు నెట్టింట తరచూ వైరల్ అవుతుంటాయి. కొంత మంది ఎలాంటి చదువు లేకున్నా.. ఇంజనీర్ల మాదిరిగా మారుతుంటారు. వారి ప్రతిభను చూసి అందరూ ప్రశంసలతో ముంచెత్తుతుంటారు. అలానే వారు చేసే పనులు ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటుంది. తాజాగా అలాంటి ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఎండాకాలంలో గదిని చల్లగా మార్చడానికి కూలర్‌ను వినియోగించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది చూసి అందరూ టాలెంట్ అంటే ఇదేనంటూ పేర్కొంటున్నారు.
దేశంలో వేసవి కాలం ప్రారంభమైంది. ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం అందరూ కూలర్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న జుగాడ్ అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైరల్ అవుతున్న క్లిప్‌లో.. కూలర్ గాలి వచ్చే దగ్గర నుంచి బస్తాల ద్వారా ఇంట్లో రూమ్‌లోకి ఏసీ మాదిరి చల్ల గాలిని తీసుకెళ్లేందుకు అమర్చారు. గాలి బయటకు వెళ్లకుండా.. బస్తాల్లో నుంచి నేరుగా రూంలోకి వెళ్లే మాదిరిగా ఏర్పాట్లు చేశారు. కూలర్ నుంచి గది వరకు బస్తాలను ఎలా ఏర్పాటు చేశారో దీనిలో చూడవచ్చు.
వైరల్ వీడియో..
ఈ అద్భుతమైన జుగాడ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో sombir_nirankari అనే యూజర్ షేర్ చేయగా.. ఈ వీడియోను 13 మిలియన్ (1.3 కోట్లు) మంది వీక్షించారు. అలానే 8 లక్షల 86 వేలకు పైగా లైక్ చేశారు. దీంతోపాటు పలు ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇది మామూలు టాలెంట్ కాదంటూ యూజర్లు పేర్కొంటున్నారు.
Also Read: