Alcohol: మద్యం అలవాటు పిల్లలపై కూడా ప్రభావం చూపుతుందట.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు..

|

Aug 02, 2022 | 6:29 AM

జర్నల్ ఆఫ్ సైకాలజీ ఆఫ్ అడిక్టివ్ బిహేవియర్స్‌ లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయన నివేదికలో తల్లిదండ్రులు మద్యం సేవించే పిల్లలు పలు ఆహార వ్యసన లక్షణాలను కలిగి ఉంటారని తేలింది.

Alcohol: మద్యం అలవాటు పిల్లలపై కూడా ప్రభావం చూపుతుందట.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
పని ఒత్తిడి, మరేదైనా ఇతర కారణాలతో మద్యం సేవించినట్లయితై అది ఎల్లప్పుడు పరిమిత మోతాదులోనే ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Follow us on

Latest Study on Alcoholic Persons: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం.. ఆల్కహాల్.. తాగేవారికి అనేక సమస్యలను కలిగిస్తుంది. ఈ విషయాలన్నీ సాధారణంగా అందరికీ తెలుసు. అయితే మద్యం (alcohol) తాగే వారికే కాదు.. వారి పిల్లలపై కూడా ప్రభావం చూపుతుందని మీకు తెలుసా..? ఈ విషయం తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం. జర్నల్ ఆఫ్ సైకాలజీ ఆఫ్ అడిక్టివ్ బిహేవియర్స్‌ (Journal of Psychology of Addictive Behaviors) లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయన నివేదికలో తల్లిదండ్రులు మద్యం సేవించే పిల్లలు పలు ఆహార వ్యసన లక్షణాలను కలిగి ఉంటారని తెలిపింది.

అధ్యయనం ప్రకారం.. ఆహార వ్యసనంలో పిల్లలకు పిజ్జా, చాక్లెట్, ఫ్రైస్ వంటి వాటిపై ఎక్కువ కోరిక ఉంటుంది. ఈ పిల్లలు వారిలో ఉండే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, కొవ్వుల అధిక సాంద్రతకు అలవాటు పడతారు. ప్రతి 5 మంది పిల్లలలో ఒకరు ఈ తీవ్రమైన వ్యసనం బారిన పడుతున్నారని వార్తా సంస్థ ANI నివేదించింది. మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అధ్యయనం సమయంలో రెండు విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. మొదటిది.. తల్లిదండ్రుల మద్యపాన అలవాటు ముఖ్యమైన ప్రమాద కారకంగా ఉందా, అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలకు అది ఎంతవరకు వ్యసనానికి దారితీస్తుందో అనే విషయాలపై అధ్యయనం జరిపారు.

ఈ అధ్యయన బృందం అధిపతి లిండ్సీ హూవర్ మాట్లాడుతూ.. అధికంగా మద్యపానం సేవించే కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులు ప్రాసెస్ చేసిన ఆహారానికి (food addiction) ఎక్కువగా బానిసలవుతారని తెలిపారు. అధ్యయనం ప్రకారం, ఆహార వ్యసనంతో పోరాడుతున్న వ్యక్తులు గంజాయి, మద్యం, సిగరెట్ లాంటి వ్యసనాలతో పాటు వ్యక్తిగత సమస్యలను కూడా కలిగి ఉంటారు.

ఇవి కూడా చదవండి

నియంత్రించడానికి చర్యలు అవసరం..

అయినప్పటికీ అతిగా మద్యం సేవించడం వల్ల కలిగే ప్రభావాలు.. అతిగా తినడం వల్ల కలిగే ప్రభావాలు తక్కువగా ఉన్నప్పటికీ.. పలు సమస్యలకు దారితీస్తాయి. నేటి కాలంలో ఎక్కువ ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం కూడా శరీరానికి హాని కలిగిస్తుంది. ఇది క్రమంగా అనేక వ్యాధులకు దారితీస్తుంది. చాలా సందర్భాల్లో ఇది మరణానికి కూడా కారణమవుతుంది. మితిమీరిన మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం, అతిగా తినడం తగ్గించడానికి జోక్యం అవసరమని ఈ అధ్యయనం సూచిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి