Viral News: ఒక్కోసారి ఆకాశంలో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. అవి వాతావరణ పరిస్థితులను బట్టి ప్రకృతిపరంగా ఏర్పడేవే ఎక్కువ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈఅద్భుతాల వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. ఆకాశంలో ఏర్పడే అద్భుతాల్లో ఎక్కువ సహజమైనవే ఉంటాయి. ఎవరైనా ఏదైనా దేశంపై కుట్రపన్ని చేసేవి చాలా తక్కువు. అయితే సహజమైనవాటికి, కుట్ర పన్నేవాటికి తేడా కూడా తెలిసిపోతుంది. ఏది ఏమైనప్పటికి ఆకాశంలో ఏర్పడే అద్భుతాలు ఒక్కోసారి భలే గమత్తుగా ఉంటాయి. వాటిని చూస్తే.. మనం చూస్తున్నది నిజమేనా అని అనిపిస్తుంది. ప్రకృతి అందాలు కొన్నిసార్లు మనల్ని మైమరపిస్తే, మరికొన్ని సార్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇక మాటల్లో వర్ణించలేని ప్రకృతి అందాల అద్భుతమైన ప్రదర్శనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇలాంటి ఓ అరుదైన అద్భుతం చైనాలోని ఆకాశంలో కన్పించింది. ఈఅద్బుతాన్ని తమ కెమెరాల్లో బంధించిన ప్రజలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇది వైరల్ అయింది. అంతే కాదు దీనిని చూస్తున్న నెటిజన్లు ఇంద్రధనస్సు లా రంగులను తలపిస్తున్న ఈఆకాశ అద్భుతం నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తోంది.
చైనా హైనాన్ ప్రావిన్స్‌లోని హైకౌ నగరంలో మేఘాలలో ఏర్పడే ఇంద్రధనస్సు.. రంగుల కిరీటం వలే కనిపించడంతో పరిసర ప్రాంతాలలో అనూహ్య అందాలు అలుముకున్నాయి. దీంతో నగర వాసులకు ఏం అర్థం కాక ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరికొందరు వీడియోలు తీసి ఎంజాయ్ చేశారు. ఇకపోతే ఇంతటి అందాన్ని చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవల్సిందే. ఇలాంటి అరుదైన ఘటనలను వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. అంత అద్భుతంగా ఉంటాయి. ఈ క్రమంలో ఇంద్రధనస్సుపై నెటిజన్లు విపరీతమైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంద్రధనస్సు మేఘానికి పుట్టినిల్లు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో దీనిని చైనాపై చేసిన కుట్రగా కొందరు అనుమానించారు. అయితే దీనిపై నాసా అధికారులతో పాటు మరికొంతమంది నిపుణులు క్లారిటీ ఇచ్చారు. ఆకాశంలో ఇలా రేండమ్‌గా ఏర్పడే ఇంద్రధనస్సును ‘స్కార్ప్ క్లౌడ్ లేదా పైలస్’ అంటారని, ఇవి కుమ్యులిఫాం టవర్ చుట్టూ ఉన్న గాలి.. త్వరగా పైకి ఎగసినపుడు పైలస్ క్లౌడ్ ఫార్మేషన్‌లు ఏర్పడతాయని క్లారిటీ ఇచ్చారు. దీంతో సూర్యకాంతి బిందువులు, మేఘంలోని మంచు స్ఫటికాల మధ్య విక్షేపం చెందినపుడు ఇంద్రధనస్సు మేఘం కనిపిస్తుందని చెప్పారు. నిపుణుల వివరణతో ఈఆకాశ అద్భుతంపై నెలకొన్న అనుమానాలకు క్లారిటీ దొరికినట్లైంది.
Rainbow colored scarf cloud over Haikou city in China pic.twitter.com/ewKmQjsiIE
— Sunlit Rain (@Earthlings10m) August 26, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..