Viral Video: అమ్మబాబోయ్.. మత్తులో రచ్చ చేసిన ఉడుత.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

|

Jul 29, 2022 | 7:54 PM

Viral Video: మద్యపానం ఆరోగ్యానికి ఎంత హానికరమో మనందరికీ బాగా తెలుసు . అయినప్పటికీ.. మద్యం ప్రియులు దానిని తాగకుండా ఉండలేరు.

Viral Video: అమ్మబాబోయ్.. మత్తులో రచ్చ చేసిన ఉడుత.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
Squirrel Eats
Follow us on

Viral Video: మద్యపానం ఆరోగ్యానికి ఎంత హానికరమో మనందరికీ బాగా తెలుసు . అయినప్పటికీ.. మద్యం ప్రియులు దానిని తాగకుండా ఉండలేరు. ఫుల్లుగా తాగి తూలిపోతుంటారు. మనుషులు తాగి తూలిపోవడం సహజం.. మరి జంతువులు తాగి తూలడం ఎప్పుడైనా చూశారా? అందులోనూ ఒక ఉడుత మందు మత్తుతో ఊగిపోవడం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి. మద్యం మత్తులో ఊగిపోతున్న ఉడుతకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు.

వాస్తవానికి ఈ వీడియోలో ఉడుత నేరుగా మందు తాగలేదు. పులియబెట్టిన పియర్స్ ఫుల్లుగా తినేసింది. ఇవి తినడం ద్వారా మత్తు ఎక్కుతుంది. ఉడుత కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. చెక్కపై పెట్టిన పీయర్స్‌ను దొరికిందే ఛాన్స్‌గా గబగబా తినేసింది ఉడుత. కానీ, ఆ తరువాత సినిమా నెక్ట్స్ లెవల్‌లో చూపించింది. పాపం, దానికి వెంటనే మత్తెక్కింది. అటూ ఇటూ తులుతూ ఉండింది. ఓసారి పడుతూ.. మరోసారి లేస్తూ చాలా ఫన్నీగా కనిపించింది. కాగా, ఉడుత ప్రవర్తనను వీడియో తీసిన వారు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఉడుత తీరును చూసి తెగ నవ్వుకుంటున్నారు నెటిజన్లు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 8 లక్షల వరకు వ్యూస్ రాగా, అంతే స్థాయిలో లైక్స్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం.. ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.


మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..