
ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్ అంటేనే మన కళ్ళను ఇట్టే మోసం చేసేస్తాయని.. ఈ ఫోటోలు మన కళ్లనే కాదు.. మెదడును కూడా తికమక పెట్టేస్తాయి. అందుకేనేమో వీటిపై నెటిజన్లు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తారు. మీరు ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను పైపైన చూస్తే.. కేవలం ఫోటోలుగానే కనిపిస్తాయి. కానీ వాటి లోపల అనేక రహస్యాలు దాగి ఉంటాయి. అవి సులభంగా దొరకవు. వాటిని కనుగొనలేక చాలాసార్లు నెటిజన్లు పప్పులో కాలేస్తుంటారు. మరి అలాంటి ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
పైన పేర్కొన్న చిత్రంలో ఓ పిల్లి దాగుంది. దాన్ని మీరు కేవలం 7 సెకన్లలో కనిపెట్టాలి. మేధావులైతే ఈజీగా గుర్తిస్తారు. మరి మీ మెదడుకు పని చెప్పండి.. కళ్లకు ఎంత పదును ఉందో ట్రై చేయండి. ఫస్ట్ అటెంప్ట్‌లో గుర్తించండి. అక్కడ ఒక చెట్లతో కూడిన ప్రాంతం ఉంది. ఆ చిన్న పిల్లి ఈ అడవిలోనే ఎంచక్కా సేద తీరుతోంది. మీకు కనిపించిందా అది ఎక్కడుందో.? లేదా ఎంత వెతికినా దొరక్కపోతే కింద ఫోటో చూడండి.