Viral Video: అలా వేధించాడని పోలీసును లాగిపెట్టి కొట్టిన స్పైస్ జెట్ ఉద్యోగిని..

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు, మహిళలను వేధిస్తున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. మహిళల పట్ల దారుణాలకు పాల్పడటం, అత్యాచారాలకు చేయడం వంటి ఘటనలు ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నాయి. అదే క్రమంలో కొందరు పోలీసులు కూడా వెకిలి చేష్టలు చేస్తూ మహిళల పట్ల ఎంతో నీచంగా ప్రవర్తిస్తున్నారు. తమకు అన్యాయం జరిగితే పోలీసులే రక్షణగా నిలుస్తారు. కానీ అలాంటి పోలీసులే తప్పులు చేస్తే.. ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది? అన్న ప్రశ్న తలెత్తుతుంది. తమ సహోద్యోగులను కూడా బెదిరించి..

Viral Video: అలా వేధించాడని పోలీసును లాగిపెట్టి కొట్టిన స్పైస్ జెట్ ఉద్యోగిని..
Viral Video

Updated on: Jul 12, 2024 | 5:13 PM

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు, మహిళలను వేధిస్తున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. మహిళల పట్ల దారుణాలకు పాల్పడటం, అత్యాచారాలకు చేయడం వంటి ఘటనలు ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నాయి. అదే క్రమంలో కొందరు పోలీసులు కూడా వెకిలి చేష్టలు చేస్తూ మహిళల పట్ల ఎంతో నీచంగా ప్రవర్తిస్తున్నారు. తమకు అన్యాయం జరిగితే పోలీసులే రక్షణగా నిలుస్తారు. కానీ అలాంటి పోలీసులే తప్పులు చేస్తే.. ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది? అన్న ప్రశ్న తలెత్తుతుంది. తమ సహోద్యోగులను కూడా బెదిరించి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇటీవల జైపూర్ ఎయిర్ పోర్టులో లేడీ స్పైస్ జెట్ ఉద్యోగిని, అక్కడే విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ అధికారిని లాగిపెట్టి కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఎయిర్‌లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జైపూర్ ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్ ఉద్యోగిని అనురాధ అనే యువతి.. విధుల్లో ఉన్న సీఎస్ఎఫ్‌ఐ పోలీసు గిరిరాజ్‌ అనే వ్యక్తిపై చెంప మీద కొట్టింది. దీంతో అక్కడున్నవారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్పైజ్ జెట్ ఉద్యోగిని అనుమతి లేకుండా వెహికిల్ గేట్ ద్వారా ప్రాంగణంలోకి రావాలని ప్రయత్నించిందని.. అందుకు ఇన్సెస్పెక్టర్ గిరిరాజ్ అనుమతిచలేదని, అందుకు ఆవేశంతో అనురాధ కొట్టిందని పోలీసులు అంటున్నారు.

అయితే ఏఎస్‌ఐ తనను లైంగకంగా వేధించాడని, డ్యూటీ తర్వాత తన క్వార్టర్స్‌కు రావాలని అసభ్యంగా ప్రవర్తించాడని, వేధింపులు మరీ ఎక్కువయ్యానని అందుకే యువతి కొట్టినట్లు స్పైస్ జెట్ సంస్థ అంటుంది. మొత్తానికి ఈ విషయంపై తీవ్ర దుమారం చెలరేగింది. విధుల్లో ఉండగా పోలీసును కొట్టినందుకు అనురాధను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.