El Diablo Restaurant: ఈ రెస్టారెంట్‌‌లో అగ్ని పర్వతంపై వంటలు.. మార్స్‌పై ఉన్న ఫీలింగ్‌ అంటున్న కస్టమర్లు

|

Feb 02, 2022 | 6:50 PM

El Diablo Restaurant: మనం అప్పుడప్పుడూ కొన్ని విచిత్రమైన వార్తలు వింటూంటాం. ఇప్పడు చెప్పుకోబోయేది కూడా అలాంటిదే... ఇదొక రెస్టారెంట్‌కు సంబంధించిన వార్త. ఈ రెస్టారెంట్‌ ఓ అగ్ని పర్వతాన్ని స్టవ్‌ గా..

El Diablo Restaurant: ఈ రెస్టారెంట్‌‌లో అగ్ని పర్వతంపై వంటలు.. మార్స్‌పై ఉన్న ఫీలింగ్‌ అంటున్న కస్టమర్లు
El Diablo Restaurant Grills
Follow us on

El Diablo Restaurant: మనం అప్పుడప్పుడూ కొన్ని విచిత్రమైన వార్తలు వింటూంటాం. ఇప్పడు చెప్పుకోబోయేది కూడా అలాంటిదే… ఇదొక రెస్టారెంట్‌కు సంబంధించిన వార్త. ఈ రెస్టారెంట్‌ ఓ అగ్ని పర్వతాన్ని స్టవ్‌ గా మార్చేసుకుని దానిపై వంట వండుతోంది. అదే స్పెయిన్ లోని టెగ్యూస్ (Teguise)లో ఉన్న ఎల్ డయాబ్లో (El Diablo Restaurant) రెస్టారెంట్. ప్రత్యేకత. ఈ రెస్టారెంట్… లాంజారోట్ (Lanzarote) అనే దీవిలో అగ్నిపర్వతంపై నిర్మించారు. ఇందులోని చెఫ్‌లు… అగ్నిపర్వత కన్నంపై వంట వండుతారు. అసలు అగ్నిపర్వతంపై రెస్టారెంట్ ని నిర్మించడమే ఓ సాహసం. ఏదైనా భవనాన్ని నిర్మించాలంటే భూమిలో పునాదిని తవ్వుతారు కదా… ఇక్కడ అలా ఏం చెయ్యలేదు. ఆర్కిటెక్టులు అగ్నిపర్వతంపైన 9 పొరలుగా సున్నపు రాయిని వేసి, దానిపైన రెస్టారెంట్ ని నిర్మించారు. ఆ తర్వాత అగ్నిపర్వత కన్నంపైన చువ్వలతో ఓ పెద్ద గ్రిల్ ఏర్పాటుచేశారు. ఆ గ్రిల్ కి 6 అడుగుల కింద అగ్నిపర్వత లావా కుతకుతా ఉడుకుతూ ఉంటుంది. అది 400 డిగ్రీల వేడితో ఉంటుంది. మాంసాన్ని గ్రిల్ చేసేందుకు ఆ వేడి పర్ఫెక్టుగా సెట్ అవుతుందట. ఈ లావా చిన్న చిన్న బుడగలతో ఉడుకుతూ ఉంటుంది. అందువల్ల పైగి ఎగజిమ్మదు. వేడి మాత్రమే పైకి వస్తుంది. అందువల్ల ఈ నేచురల్ స్టవ్ ఏర్పాటు చేయడానికి వీలైంది.

ఈ అగ్ని పర్వతం 1824లో భారీగానే బద్ధలైంది. ఆప్పటి నుంచి అది యాక్టివ్ గానే ఉన్నా… మళ్లీ బద్ధలవ్వట్లేదు. అందువల్లే అక్కడ ఈ రెస్టారెంట్ బిజినెస్ హాయిగా సాగుతోంది. ఈ రెస్టారెంట్ కి వెళ్లిన వారికి పానోరామిక్ వ్యూలో బయటి ప్రపంచం కనిపిస్తుంది. అక్కడి తిమన్ ఫాయా నేషనల్ పార్క్ ని ఇక్కడి నుంచి చూడొచ్చు. అంతేకాదు… అగ్నిపర్వతం నుంచి వచ్చిన ఎర్రటి ఇసుక… ఎర్రటి మైదానంలా కనిపిస్తూ… అంగారక గ్రహంపై ఉన్న ఫీల్ కలిగిస్తుంది. అందుకే టూరిస్టులు అక్కడికి బాగానే వెళ్లి ఎంజాయ్ చేస్తారు. 18వ శతాబ్దంలో దాదాపు 100 అగ్నిపర్వతాలు ఆ దీవిలో యాక్టివ్ గా ఉండేవి. ఇప్పటికీ వాటిలో కొన్ని యాక్టివ్ గానే ఉన్నా… ఏవీ బద్ధలవ్వట్లేదు. అందువల్ల ఈ రెస్టారెంట్… ప్రపంచంలోని ఇతర రెస్టారెంట్లకు భిన్నమైనదిగా గుర్తింపు పొందింది.

Also Read:

 28 మంది వైసిపీ ఎంపీలు విఫలం.. పోలవరం ఎప్పటికి పూర్తి అవుందో అంచనాలకు అందడం లేదన్న జనసేనాని