Viral: ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. చేలో కనిపించింది చూసి షాక్.. నల్లటి ఆకారంతో..

| Edited By: Ravi Kiran

Aug 06, 2022 | 4:18 PM

ఎప్పుడూ లేనిది పొలంలో ఏదో ఎత్తైన.. నలుపు రంగులో ఉన్న వస్తువు నిటారుగా నిలబెట్టి ఉంది. అసలు అదెంటి అన్నది అతనికి ఆర్థం కాలేదు. ఆశ్చర్యం, భయం నిండిన ఉద్రేకంతో దాని వద్దకు వెళ్లాడు.

Viral: ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు..  చేలో కనిపించింది చూసి షాక్.. నల్లటి ఆకారంతో..
representative image
Follow us on

Trending: అతనో రైతు.. అప్పుడప్పుడు పొలానికి వెళ్లి పనులన్నీ చక్కబెట్టుకుని తిరిగి వస్తుంటారు. ఇటీవల తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఆయన.. అక్కడ కనిపించింది చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఎప్పుడూ లేనిది పొలంలో ఏదో ఎత్తైన.. నలుపు రంగులో ఉన్న వస్తువు నిటారుగా నిలబెట్టి ఉంది. అసలు అదెంటి అన్నది అతనికి ఆర్థం కాలేదు. ఆశ్చర్యం, భయం నిండిన ఉద్రేకంతో దాని వద్దకు వెళ్లాడు. చెక్ చేసిన అనంతరం అప్పుడు అది ఒక శకలం అని గుర్తించాడు. కానీ అది అక్కడ పడిందా.. లేదా ఎవరైనా తీసుకువచ్చి వదిలేసి వెళ్లారా అనే విషయం అతడికి అర్థం కాలేదు. ఆ తర్వాత అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి పరీక్షలు చేసి.. అది ‘స్పేస్ ఎక్స్’ క్యాప్సూల్‌‌(SpaceX capsule)కు చెందిన శకలం అని నిర్ధారించారు. ఇది సుమారు 3 మీటర్ల పొడవు, 20 నుంచి 30 కిలోల మధ్య బరువు ఉంటుందని తెలిపారు. అది అంతరిక్షం నుంచి ఆ రైతు పొలంలో పడినట్లుగా ఐడెంటిఫై చేశారు. ఆ రైతు పేరు మిక్ మైనర్స్. అతను ఆస్ట్రేలియా(Australia)లోని న్యూ సౌత్ వేల్స్(New South Wales) సమీపంలోని గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉంటాడు. జూలై 9వ తేదీన ఈ శకలం ఆయన వ్యవసాయం క్షేత్రంలో పడిందని.. కానీ కొద్ది రోజుల తర్వాత రైతు దాన్ని గుర్తించారని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియాలోని మౌంట్ స్ట్రోమ్లో అబ్జర్వేటరీలోని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ బ్రాడ్ టక్కర్ ఈ శిథిలాన్ని పరిశీలించి.. ఇది  అద్భుతమైన ఆవిష్కరణ అని పేర్కొన్నారు. మాములుగా అయితే ఇలాంటి శిథిలాలు, వ్యర్థాలు సముద్రాల్లో పడతాయని.. భూమిపై అరుదుగా మాత్రమే పడతాయని తెలిపారు. కాగా ఆ రైతు పొలానికి దగ్గర్లో సెర్చ్ ఆపరేషన్ చేయగా మరో 2 శిథిలాలు లభ్యమయ్యాయి. ఇలాంటివి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ప్రజలను కోరింది.

Spacex Capsule

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి