సముద్రం అడున కూడా అనేక జంతుజీవాలు ఉంటాయని తెలుసు.. అందమైన దీవుల అడుగున కూడా అనేకం జీవిస్తుంటాయి. సముద్రం అట్టడుగున ఉండే అక్కడి జంతు ప్రపంచం అనేక మిలియన్ల జీవుల రాజ్యం. ముఖ్యంగా సముద్రం అడుగున ఉండే చేపలు ఎన్నో రకాలు, మరెన్నో అద్భుతమైనవి, వింతైనవి కూడా ఉంటాయి. వాటిల్లో కొన్ని చూసేందుకు ఎంతో భయంకరంగా కనిపించేవి కూడా ఉన్నాయి. అలాంటి ఓ భయంకర రూపంతో ఉన్న సముద్రపు అడుగున జీవించే చేప ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.
సముద్ర గర్భంలో ఎన్నో రకాల చేపలు ఉంటాయని తెలుసు. కాని కొన్నిటి గురించి మనం అసలేమీ విని ఉండం. అలాంటి కోవకు చెందినది ఈ చేప కూడా. ఒక మత్స్యకారుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పట్టుకున్న చేప ఫోటోను పోస్ట్ చేశాడు. దానికి “ఫ్రాంకెన్‌స్టైయిన్స్ ఫిష్” అనే క్యాప్షన్‌తో షేర్ చేయగా, అది కాస్త నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. గత వారంరోజులుగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలోని చేప తెల్లని రంగుతో కనిపిస్తోంది. ఆకుపచ్చని కళ్ళు, ఒళ్లంతా బెల్లం రంగు కలిగిన చారికలతో ఉంది.. ఈ వింత చేప తోక కూడా చిరిగిన రెక్కల వలె కనిపిస్తుంది. చేపపై విచిత్రమైన గుర్తులు కూడా ఉన్నాయి. అలాగే, మరో చేప ఫోటోను కూడా షేర్ చేశాడు సదరు మత్స్యాకారుడు అది మరింత భయానకంగా కనిపిస్తోంది. ఈ చేప వైపర్ ఫిష్‌గా చెబుతున్నారు. ఇది రాక్షసిలాంటి నోరు, ఆ నోటిలో ఈటెల్లాంటి పళ్లు. శరీరమేమో పాములా కనిపిస్తుంది.
వింతచేప ఫోటో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు భయపడుతున్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి చేపలు సముద్రంలో లోతుగా ఉండే ప్రదేశంలోనే నివసిస్తాయంటూ కొందరు నెటిజన్లు చెబుతున్నారు. ఒక మూడవ రకం చేప వైపర్ ఫిష్. రాక్షసిలాంటి నోరు, ఆ నోటిలో ఈటెల్లాంటి పళ్లు. శరీరమేమో పాములా ఉంటుంది. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది.
ఇలాంటి మరిన్ని వైరల్ న్యూస్ కోసం..