Trending News in Telugu: స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగుతూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఆ ప్రబుద్దుడి వ్యవహారాలకు సంబంధించి ఒక్కోటి బయటకు వస్తున్నాయి. దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన స్పైస్‌జెట్ విమానంలో హర్యానాకు చెందిన బాడీ బిల్డర్, సోషల్ మీడియా ఫేమ్ బాబీ కటారియా సిగరెట్ తాగుతున్న వీడియో వివాదాస్పదంగా మారడం తెలిసిందే. బాబీ కటారియా 15 రోజుల పాటు విమానంలో ప్రయాణించకుండా బ్యాన్ చేసినట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి బాబీ కటారియాపై తగిన చర్యలు తీసుకుంటామని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఈ వీడియోపై వివాదం సద్దుమణక ముందే.. తాజాగా అతనికి సంబంధించిన మరో వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబీ కటారియా నడిరోడ్డుపై చైర్‌లో కూర్చొని మద్యం తాగుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.
నడిరోడ్డుపై కాస్త ఎంజాయ్ చేద్దాం.. అని బాబీ చెబుతున్నట్లు ఈ వీడియోలో రికార్డ్ అయ్యింది. జులై 28న బాబీ కటారియా తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఈ వీడియోను అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాబీ ఇన్‌స్టా అకౌంట్‌కి 6.3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
నడి రోడ్డుపై మద్యం తాగుతున్న సోషల్ మీడియా ఫేమ్..
వాహన రాకపోకలు ఎక్కువగా ఉండే డెహ్రాడూన్ మెయిన్ రోడ్డుపై బాబీ మద్యం తాగుతున్నట్లు గుర్తించిన ఉత్తరాఖండ్ పోలీసులు.. అతనిపై కేసు నమోదుచేశారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదుచేసినట్లు ఉత్తరాఖండ్ పోలీసులు తమ ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ విచారణకు ఆదేశించారు.
सोशल मीडिया पर बॉबी कटारिया नामक युवक द्वारा सड़क पर अतिक्रमण कर खुले में शराब पीने संबंधी वायरल वीडियो का श्री Ashok Kumar IPS, DGP Sir द्वारा संज्ञान लेने के बाद #UttarakhandPolice ने बॉबी कटारिया के विरुद्ध 290/510/336/342 IPC व 67 IT Act के अंतर्गत मुकदमा पंजीकृत किया है। pic.twitter.com/DJ4xOadw6q
— Uttarakhand Police (@uttarakhandcops) August 11, 2022
బాబీ కటారియా వీడియోలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అతన్ని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. బాబీ కటారియాతో కలిసి ఇలాంటి వీడియోలు చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన అతని సన్నిహితులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగుతున్న బాబీ కటారియా వీడియో..
New rule for Bobby kataria ? @JM_Scindia @DGCAIndia @CISFHQrs pic.twitter.com/OQn5WturKb
— Nitish Bhardwaj (@Nitish_nicks) August 11, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తలు చదవండి..