Viral Video: నెమలి చేసిన ఈ జంపింగ్‌కి ఎవరైనా సరే వావ్ అనాల్సిందే..

|

Aug 26, 2024 | 4:51 PM

నెమలి అంటే ఇష్టం లేదని అనే వారే ఉండరు. చాలా మందికి నెమలి అంటే చాలా ఇష్టం. నెమలి చూడటానికే ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తన అందచందాలతో అడవికే అందం తీసుకొచ్చేది నెమలి మాత్రమే. నీలి, పచ్చ రంగులో మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. నెమలి డ్యాన్స్ చేస్తే రెండు కళ్లూ చాలవు. అందులోనూ నెమలి పింఛాన్ని పురివిప్పినప్పుడు చూస్తే.. వావ్ అనక తప్పదు. నెమలి అందంగా..

Viral Video: నెమలి చేసిన ఈ జంపింగ్‌కి ఎవరైనా సరే వావ్ అనాల్సిందే..
Viral Video
Follow us on

నెమలి అంటే ఇష్టం లేదని అనే వారే ఉండరు. చాలా మందికి నెమలి అంటే చాలా ఇష్టం. నెమలి చూడటానికే ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తన అందచందాలతో అడవికే అందం తీసుకొచ్చేది నెమలి మాత్రమే. నీలి, పచ్చ రంగులో మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. నెమలి డ్యాన్స్ చేస్తే రెండు కళ్లూ చాలవు. అందులోనూ నెమలి పింఛాన్ని పురివిప్పినప్పుడు చూస్తే.. వావ్ అనక తప్పదు. నెమలి అందంగా.. సొంపుగా రివ్వున చెట్టుపైకి ఎగురుతున్న ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఓ వీడియో వైరల్ అవుతుంది. నెమలి అందాన్ని అనుకోకుండా తన ఫోన్‌లో బంధించాడు. ఈ వీడియో చూపరులను తెగ ఆకట్టుకుంటుంది.

ఈ వీడియోలో.. అడవిలోని ఓ దారిలో నెమళ్లు సంచరిస్తూ ఉన్నాయి. మొత్తం మూడు నెమళ్లు నడిచి వెళ్తుండగా.. ఇందులో ఒకటి ఆహారం కోసం అన్వేషిస్తూ ఉండి. మరొకటి నడుస్తూ ఉండగా.. ఇంకో నెమలి ఒక్కసారిగా గాలిలోకి అనూహ్యంగా ఎగిరింది. అలా నెమలి ఎగురుతున్న సమయంలో ఎంతో అందంగా, చూడముచ్చటగా కనిపించింది నెమలి. పొడవైన తన పింఛం.. అందమైన రెక్కలు విప్పుతూ ఎగురుతున్న దృశ్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది.

ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఎంతో ముచ్చట పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ‘వావ్ ఎంత అందంగా ఉంది’.. ‘దగ్గర ఉండి చూస్తే ఇంకా బాగుండేది’.. ‘థాంక్స్ ఇంత అందమైన వీడియో అందించినందుకు’.. ‘ఏంటి నెమలి ఇంత పైకి ఎగురుతుందా’.. ‘నిజంగానే ఆశ్చర్యంగా ఉంది’.. అంటూ కామెంట్స్‌తో పాటు రకరకాల ఎమోజీలను కూడా షేర్ చేస్తున్నారు.

వీడియోచూడండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..