Viral Video: బిత్తరపోయే వీడియో.. తల కట్ చేసిన 5 గంటల తర్వాత.. పాము అటాక్..

|

Apr 08, 2023 | 5:43 PM

పాములను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా.. కాటు తప్పదు. ఎన్నో వందలు, వేల పాములు పట్టిన స్నేక్ క్యాచర్స్ సైతం పాము కాటుకు బలైన ఘటనలు మనం చూశాం. తాజాగా శిరచ్ఛేదం చేసిన తర్వాత కూడా ఓ పాము అటాక్ చేసేందుకు ప్రయత్నించిన వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం.

Viral Video: బిత్తరపోయే వీడియో.. తల కట్ చేసిన 5 గంటల తర్వాత.. పాము అటాక్..
Snake Viral Video
Follow us on

పాములు అంటే చాలామందికి భయం.. స్నేక్ కనపడితే చాలు.. వెంటనే పరిగెత్తుతారు. ధైర్యం ఉన్నవాళ్లు అయితే దాన్ని చంపేస్తారు. అయితే పాములు అన్నీ హానికరం కావు. కేవలం 7 శాతం మాత్రమే విషపూరితమైనవి. అవి కూడా తమకు సమస్య అని భావించినప్పుడే అటాక్ చేస్తాయి. ఇక నెట్టింట్ డైలీ రకరకాల పాముల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిల్లో నుంచి ఓ షాకింగ్ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇందులో ఆశ్చర్యకరంగా  తల లేని పాము ఓ వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో వాస్తవానికి 2018లో అప్‌లోడ్ చేయబడింది, కానీ ఇప్పుడు మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

“నేను ఈ పామును చంపలేదు. ఇది తన పిల్లలు ఊయల ఊగే ప్లేసుకు దగ్గరగా వెళ్లడంతో నా స్నేహితుడు చంపేశాడు. విషయం తెలిసిన..  ఐదు గంటల తర్వాత నేను వెళ్లి.. దాని చర్మం తీసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అది నాపై దాడి చేసేందుకు యత్నించింది. దీంతో ఒక్కసారిగా షాక్‌ను గురయ్యాను” అని వీడియో డిస్క్రిప్షన్‌లో రాసి ఉంది.

దీనిపై నెటిజన్లను రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. మజిల్ మెమరీతో పాము సెల్ప్ డిఫెన్స్‌కు యత్నించిందని ఓ యూజర్ పేర్కొన్నాడు. నేను ఎప్పడూ ఇలాంటి ఇన్సిడెంట్ చూడలేదని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.

వీడియో దిగువన చూడండి…

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..