పాము పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. పొదలు ఉన్న ప్రాంతంలో, గ్రామాల్లో పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు అవి ఇళ్లలోకి, పార్క్ చేసి ఉంచిన వాహనాల్లోకి ప్రవేశించి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తుంటాయి. అలాంటి పాములు మీ ఇంట్లో ఒకేసారి 4 నుంచి 5 పాముల వరకు గుంపుగా కనిపిస్తే.. ఎలా ఉంటుంది..? వామ్మో ఇంకా ఏమైనా..? అసలు ఊహించలేని సంఘటన నిజంగానే జరిగింది. ఒకే ఇంట్లో 4 నుంచి 5 పాములను రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పంజాబ్‌లో జరిగినట్టుగా తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పంజాబ్‌లోని జలంధర్‌లోని ఓ ఇంట్లో నాలుగు పాములు కనిపించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. స్నేక్ క్యాచర్స్ ఎంతో కష్టపడి.. అనేక ప్రయత్నాల తరువాత ఇంట్లో నుండి పాములను విజయవంతంగా పట్టుకోగలిగారు. ఇంతకీ ఆ పాములు ఆ ఇంట్లోకి ఎలా వచ్చాయనే వివరాల్లోకి వెళితే…
జలంధర్‌లో నివసిస్తున్న ముఖేష్‌కుమార్‌కు కొద్దిరోజుల క్రితం తన మంచంలో పాము చర్మం కనిపించింది. కానీ, అతడు దాన్ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పాడు.. అయితే కొన్ని రోజుల తర్వాత ముఖేష్ తన పడకగదిలో మళ్లీ నాలుగు పాములు కనిపించాయి. పాము కనిపించిన వెంటనే స్నేహితులందరికీ ఫోన్ చేశారు. ఇంట్లో నాలుగు పాములు కనిపించడంతో కుంటుబీకులు భయంతో వణికిపోయింది. వెంటనే స్నేహితులకు, స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు..సంఘటనా స్థలానికి చేరుకున్న పాములు పట్టే వారు చాకచక్యంగా వ్యవహరించి నాలుగు పాములను బంధించారు. పాముల కారణంగా ఆ ఇంట్లోకి ఎవరికీ ఎలాంటి హాని కలుగులేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ @పంజాబిబుల్లెటిన్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అనేక వ్యూస్, రియాక్షన్స్ వస్తున్నాయి.
సోషల్ మీడియాలో రోజురోజుకు రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో చాలా పాము వీడియోలు కూడా ఉన్నాయి. పాము అని చెబితేనే చాలా మంది భయంతో పారిపోతారు. వాటిలో, కింగ్ కోబ్రా వంటి అత్యంత విషపూరితమైన పాము కంటపడితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సిందే… అయినప్పటికీ, చాలా మంది పాములను పట్టడమే జీవనోపాధిగా గడుపుతుంటారు.. అలాగే మరికొందరు ఫేమస్ కావటం కోసం పాములను పడుతుంటారు. కొందరు స్టంట్స్ పేరుతో పాములతో గేమ్స్ ఆడుతుంటారు.. పాములను ముద్దాడేందుకు సాహసించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా చూశాం..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..