
పాములు.. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో బాగా నడిచే టాపిక్. ఫ్రిడ్జ్‌లు, కూలర్లు, సీలింగ్ ఫ్యాన్లు.. ఇలా ఎక్కడ దొరికితే అక్కడ దర్శనమిస్తూ జనాలను భయపెడుతున్నాయ్. ఇక అందుకు సంబంధించిన వైరల్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మరాయి. ఇక అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ఇప్పుడు మీకోసం..
వాతావరణం చల్లగా ఉంది కదా అని.. కొందరు బీరు తాగుదామని ఓ వైన్ షాప్‌కు వచ్చారు. అప్పుడే వారికి ఎదురుగా కనిపించింది చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఓ పాము వైన్ షాప్‌లోకి ఎలా వచ్చిందో ఏమో గానీ.. ఒక్కసారిగా మందుబాబులను భయపెట్టేసింది. షాప్‌లోకి దూరడమే కాదు.. మందుబాటిళ్ల పక్కనే ఉన్న సీసీ కెమెరాను చుట్టేసుకుంది. కర్రతో దాన్ని బయటకు తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. ఆ చర్య పాముకు చిర్రెత్తుకొచ్చినట్టు ఉంది. నన్నే బయటకు తోసేస్తావా అంటూ.. మందుబాటిళ్లపైకి ఎక్కి.. వాటిని కిందకు తోసేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో లేకపోగా.. ఈ చిన్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. మందుబాబుల వీక్‌నెస్ పాము భలే పట్టేసిందిగా అంటూ రకరకాల ఎమోజీలతో రచ్చ చేస్తున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.