AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో చూస్తే అవాక్కే..

ప్రకృతిలో వింతలకు కొదవలేదు.. వేటాడి తినడమే పరమావధిగా బతికే ఓ పాము.. ప్రాణాపాయంలో ఉన్న చేపకు ప్రాణభిక్ష పెట్టిందా? దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. జంతువుల్లోని మానవత్వమా అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు. నిజంగా పాము చేపను కాపాడిందా..? లేదా తినలేక వదిలేసిందా..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Viral Video: ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో చూస్తే అవాక్కే..
Did A Snake Really Save A Dying Fish Life
Krishna S
|

Updated on: Jul 17, 2026 | 3:32 PM

Share

సోషల్ మీడియా అనేది ఒక మాయా ప్రపంచం. ఇక్కడ జీవితంలో మనం ఊహించని ఎన్నో వింతలు, విశేషాలు కళ్లముందు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా జంతు ప్రపంచానికి సంబంధించిన వీడియోలకు నెటిజన్లలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ కొన్ని వీడియోలు చూసినప్పుడు ఇది నిజంగానే జరిగిందా? అని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. సరిగ్గా అలాంటి ఒక వింత వీడియోనే ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఓ పాము, చనిపోతున్న స్థితిలో ఉన్న చేపను తినడానికి బదులు.. దాన్ని కాపాడి నీటిలోకి నెట్టిందంటూ ఒక వార్త వైరల్‌గా మారింది. టర్కీకి చెందిన ప్రముఖ న్యూస్ అకౌంట్ @gusholderhaber ఎక్స్‌లో షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 2025 ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు ఈ వీడియో ఏకంగా 12 మిలియన్లకు పైగా వ్యూస్‌ను, వేలాది లైక్స్, కామెంట్లను సొంతం చేసుకుంది. ఈ వీడియోకు పెట్టిన ఎమోషనల్ క్యాప్షన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

వీడియోలో ఏముంది?

ఆ వీడియోను గమనిస్తే.. నీటి పక్కన ఉన్న ఒక బండరాయిపై ఓ చేప ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటూ కనిపిస్తుంది. అంతలోనే అక్కడికి ఒక పాము వచ్చింది. సాధారణంగా పాములకు చేపలు మంచి ఆహారం. కానీ ఆ పాము ఆ చేపను తినకుండా.. అటు ఇటు తిప్పుతూ మెల్లగా నీటి వైపు తీసుకువెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. చివరకు ఆ చేప నీటిలోకి వెళ్లడంతో ప్రాణాలు దక్కించుకుని ఈదుకుంటూ వెళ్లిపోతుంది. ‘‘చనిపోతున్న చేపను చూసి జాలిపడ్డ పాము.. దాన్ని తినకుండా తిరిగి నీటిలోకి చేర్చి ప్రాణాలు కాపాడింది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అసలు నిజం ఏంటి? నెటిజన్ల లాజిక్..

ఈ వీడియో చూసి చాలామంది “జంతువుల్లో కూడా ఎంత జాలి ఉందో” అని ఎమోషనల్ అవుతుంటే, మరికొందరు మాత్రం దీని వెనుక ఉన్న అసలు లాజిక్‌ను బయటపెడుతున్నారు. వాస్తవానికి ఆ పాము చేపను కాపాడాలని అనుకోలేదు, దాన్ని ఆహారంగా మార్చుకుందామనే ప్రయత్నించింది. చేప శరీరంపై ఉండే జిగురు, తడి కారణంగా పాము దాన్ని గట్టిగా పట్టుకోలేకపోయింది. చేపను నోట్లోకి మింగడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అది పదే పదే జారిపోతూ వచ్చింది. అలా పాము పట్టు తప్పి చేపను తిప్పే క్రమంలో, అది యాదృచ్ఛికంగా నీటి అంచుకు వచ్చి ప్రాణాలతో నీటిలోకి జారిపోయింది తప్ప పాము దానికి ప్రాణభిక్ష పెట్టలేదని నెటిజన్లు కామెంట్ల రూపంలో క్లారిటీ ఇస్తున్నారు. ఏది ఏమైనా.. పాము వేటాడటంలో విఫలమవ్వడం.. ఒక ప్రాణాన్ని కాపాడటం అనేది మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

వీడియో చూడండి..

Follow Us
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి పెంపు
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి పెంపు
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్