Viral Video: అబ్బాయికి అయినా, అమ్మాయికి అయినా జుట్టు ఎంతో కీలకం. జుట్టు వ్యక్తుల అందాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది. అందుకే జుట్టు విషయంలో ప్రజలు చాలా కేర్ తీసుకుంటారు. కేశాలంకరణ.. వ్యక్తులను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. అమ్మాయిలు.. తమ జుట్టు పొడవుగా పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు. అబ్బాయిలు తమ జుట్టును రకరకాల స్టైళ్లలో కటింగ్స్ చేయించుకుంటున్నారు. అమ్మాయిలు కూడా తమ జుట్టును కత్తిరించుకోవడం, వెరైటీగా కనిపించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
అయితే, తాజాగా ఓ యువతి హెయిర్ కటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏం గుండె ధైర్యం సామీ అంటూ అవాక్కవుతున్నారు. ఆ యువతి తన హెయిర్ కటింగ్‌ను అసాధారణమైన రీతిలో చేయించుకోవడం ఇక్కడ విశేషం. సాధారణంగా ఎవరైనా కటింగ్‌ను కత్తెరతో చేస్తారు. కానీ ఇక్కడ మటన్ కత్తితో చేయడం విశేషం. అవునండీ బాబు.. మాంసం కట్ చేసే కత్తితో ఓ వ్యక్తి మహిళ జట్టును కట్ చేశాడు.
మహిళ నేలపై పడుకోగా.. ఆమె జుట్టును ఒక చెక్కపై సెట్ చేసి మాంసం కట్ చేసే కత్తితో సమానంగా కట్ చేశాడు. జుట్టును అలా చేస్తున్న సమయంలో మహిళ వీడియో చిత్రీకరించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 5 లక్షల వరకు వ్యూస్ రాగా, వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Viral Video:
Also read:
Samantha-Naga Chaitanya Divorce Live Video: కెరీర్ సక్సెస్ వల్ల పెర్సనల్ లైఫ్ ప్రభావితం అవుతుందా..?
NRI News: ఇక అలాంటి పప్పులేమీ ఉడకవు.. కస్టమర్లకు ఊహించని ఝలక్ ఇచ్చిన రెస్టారెంట్..