Watch: కారులో విమాన ప్రయాణం.. ఫస్ట్‌ప్లోర్‌ నుండి నేరుగా గ్రౌండ్‌కి.. షాకింగ్ వీడియో వైరల్..

ఈ ఘటన పూణెలోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. విమాన్ నగర్‌లోని శుభ్ అపార్ట్‌మెంట్ పార్కింగ్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. అయితే, ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. కారులో నుంచి డ్రైవర్‌ను బయటకు తీశారు. అయితే, ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.

Watch: కారులో విమాన ప్రయాణం.. ఫస్ట్‌ప్లోర్‌ నుండి నేరుగా గ్రౌండ్‌కి.. షాకింగ్ వీడియో వైరల్..
Car Fell From First Floor

Updated on: Jan 22, 2025 | 9:51 PM

ఒక కార్‌ డ్రైవర్ చేసిన చిన్న తప్పిదం పెను ప్రమాదానికి దారి తీసింది. అపార్ట్‌ మెంట్‌లోని పార్కింగ్‌ కాంప్లెక్స్‌లోంచి కారు అమాంతంగా గాల్లో ఎగిరొచ్చి కింద పడిపోయింది. డ్రైవర్‌ పొరపాటున రివర్స్ గేర్ వేయడంతో కారు పార్కింగ్ కాంప్లెక్స్ గోడను బద్దలు కొట్టుకుని ఒకటో అంతస్తు నుంచి కింద పడిపోయింది. ఈ షాకింగ్‌ సంఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పుణేలోని విమన్ నగర్‌లో శుభ గేట్ వే అపార్ట్‌మెంట్‌లో వాహనాల పార్కింగ్ కోసం మొదటి అంతస్తులో స్థలం ఉంది. అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తు నుంచి కారు కింద పడిపోయిన షాకింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన పూణెలోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. విమాన్ నగర్‌లోని శుభ్ అపార్ట్‌మెంట్ పార్కింగ్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. అయితే, ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. కారులో నుంచి డ్రైవర్‌ను బయటకు తీశారు. అయితే, ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

డ్రైవర్‌ ప్రమాదవశాత్తూ రివర్స్‌ గేర్‌ వేయడంతో కారు అదుపుతప్పింది. దాంతో అమాంతంగా కారు మొదటి అంతస్తు నుంచి కిందకు పడిపోయింది. మొదటి అంతస్తులోని గోడను బద్దలు కొట్టుకుని కారు కింద పడింది. ఆ సమయంలో భారీ శబ్ధం వచ్చింది. ఆ పెద్ద శబ్ధాలకు చుట్టుపక్కల వారు పరుగులు తీయడం సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. కాకపోతే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. అయితే పార్కింగ్ వాల్ నిర్మాణ నాణ్యతపై పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..