ఒక చిన్న పిల్లవాడు తన తండ్రితో ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. సోషల్ మీడియాలోని నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న ఈ క్యూట్ వీడియోను మీరు చూస్తే ‘వావ్ సో క్యూట్’ అని అనకుండా ఉండలేరు. చిన్న పిల్లలు ఎప్పుడూ కూడా తమ తల్లిదండ్రులు చేసే పనులను అనుకరిస్తూ నేర్చుకుంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రస్తుత కాలంలో భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయడం.. ఇంటి పనులలో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం శరామాములే. ఆ క్రమంలో వీడియోలోని వ్యక్తి తన భార్యకు వంటలో సహాయం చేయాలనుకున్నాడో.. లేక తన భార్య అప్పగించిన పనిని చేస్తున్నాడో తెలియదు కానీ చూస్తే నవ్వేసుకోవాల్సిందే. అసలు ఆ వీడియోలో ఏముందో ఓ లుక్కెద్దాం..
endukandi అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఉడికిన బంగాళదుంపలపై తోలు తీస్తుంటాడు. అయితే కెమెరా ఫోకస్ ఆ వ్యక్తి పక్కనే ఉన్న అతని బేబీ బాయ్ మీదకు వెళ్తుంది. అప్పుడు కనుక మనం వీడియోను చూసినట్లయితే ఆ చిన్నారి.. తోలు తీసిన బంగాళదుంపలను మెదుపుతూ పిండి పిండి చేస్తున్నాడు. ఇక ఈ దృశ్యాలను వైరల్ అవుతున్న ఆ వీడియోలో మనం కంటికి కట్టినట్లుగా చూడవచ్చు. తన తండ్రికి సాయం చేసేందుకు ఎంతో బాధ్యతగా బంగాళదుంపలను పిండి చేస్తున్న ఆ చిన్నారిని చూసిన నెటిజన్లు ‘ఆ క్యూట్ చెఫ్ మాకు కావాలి’ అని, ‘ఆదర్శపుత్రుడు’ అని కామెంట్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..