Viral Video: కొత్త భాష నేర్చుకోవడం అనేది కొంతమంది పిల్లలకు కష్టమైన పని..అయితే పిల్లలకు సరదాగా నేర్చుకోవడం కోసం ఉపాధ్యాయులు కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి చదువు నేర్పటం వల్ల విద్యార్థుల ఇబ్బందులు తొలగిపోతాయి. కొంతమంది పాఠశాల విద్యార్థులు హిందీ వ్యాకరణం ప్రాథమికాలను కవిత్వం, నృత్య రూపంలో వివరిస్తున్న వీడియో ఒక టి ఇందుకు ఉదాహరణగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పోస్ట్ పై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది పిల్లలకు నేర్చుకునే ప్రక్రియను సులభంగా, సరదాగా చేసిన ఉపాధ్యాయుడిని ప్రశంసించారు.
IAS అధికారి అర్పిత్ వర్మ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో…హిందీ వ్యాకరణం ప్రాథమికాలను కవిత్వం నృత్య రూపంలో స్టూడెంట్స్ కి వివరిస్తున్నారు. పాటను సరిగ్గా పూర్తి చేయమని ఉపాధ్యాయులు పిల్లలను ప్రేరేపించడంతో అద్భుతమైన వీడియో ముగుస్తుంది. ఆమె వారి ప్రయత్నాలను ‘చాలా బాగుంది’ అంటూ ప్రశంసిస్తున్నారు.
अद्भुत..!!
स्कूली विद्यार्थी कविता एवं नाटक के माध्यम से हिंदी व्याकरण कैसे सीख रहे हैं, आप भी देखिए..!! pic.twitter.com/9cjeq3MroK
— Arpit Verma IAS (@arpit_verma13) September 19, 2022
అద్భుతం.. పాఠశాల విద్యార్థులు కవిత్వం, నాటకం ద్వారా హిందీ వ్యాకరణాన్ని ఎలా నేర్చుకుంటున్నారో చూడండి అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో 149వేలకు పైగా వీక్షణలు, టన్నుల కొద్దీ కామెంట్లను పొందింది. ప్రజలు క్లిప్‌ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. పెప్పీ హిందీ వ్యాకరణ పాట వెనుక ఉన్న సూత్రదారులను కూడా నెటిజన్లు ప్రశంసించారు. ఇలాంటి పాటలు విద్యార్థుల్లో నేర్చుకునే ఆసక్తిని ఎలా పెంచుతాయనే విషయాన్ని కూడా చాలా మంది నెటిజన్లు కామెంట్ల రూపంలో రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి