Viral Video: జై శ్రీరామ్ అంటూ రామయ్య సాంగ్ కు విద్యార్థులు డ్యాన్స్.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో

|

Jan 02, 2024 | 1:46 PM

పాఠశాల లోపల ఒక హాలులో చాలా మంది స్టూడెంట్స్  లైన్ లో నిల్చున్నారు. వాళ్ళాకి ఎదురుగా ఒక టీచర్ ఉన్నారు. ఈ సమయంలో రాముడికి సంబంధించిన పాట ప్లే అయిన వెంటనే.. టీచర్ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. తమ టీచర్ ని అనుసరిస్తూ స్టూడెంట్స్ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. రాముడి మీద భక్తిని కనబరుస్తూ చిన్నారులు అద్భుతంగా డ్యాన్స్ చేశారు.

Viral Video: జై శ్రీరామ్ అంటూ రామయ్య సాంగ్ కు విద్యార్థులు డ్యాన్స్.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో
Student Video Viral
Follow us on

500 ఏళ్ల ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడే సమయం ఆసన్నం అవుతుంది. మరికొన్ని రోజుల్లో అయోధ్యలో రామయ్య కొలువుదీరే సమయం ఆసన్నం అవుతోంది. దీంతో మొత్తం రామ్ పేరు మాత్రమే మార్మోగుతోంది. రాముడి జన్మ భూమి పస్తుతం వార్తల్లో నిలుస్తోంది. భారీ రామాలయం సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అయోధ్యలో 8 కిలోమీటర్ల పొడవైన రోడ్ షో ని నిర్వహించడమే కాదు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కొత్త భవనాన్ని కూడా ప్రారంభించారు. అనేక ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా.. విన్నా రామ మందిరం గురించే.. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో రాముడి పాటలకు పిల్లలు డ్యాన్స్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియో భారతీయుల హృదయాలను గెలుచుకుంది.

పాఠశాల లోపల ఒక హాలులో చాలా మంది స్టూడెంట్స్  లైన్ లో నిల్చున్నారు. వాళ్ళాకి ఎదురుగా ఒక టీచర్ ఉన్నారు. ఈ సమయంలో రాముడికి సంబంధించిన పాట ప్లే అయిన వెంటనే.. టీచర్ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. తమ టీచర్ ని అనుసరిస్తూ స్టూడెంట్స్ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. రాముడి మీద భక్తిని కనబరుస్తూ చిన్నారులు అద్భుతంగా డ్యాన్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

స్కూల్ పిల్లలు బాలీవుడ్ పాటలపై డ్యాన్స్ చేస్తున్న వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే స్కూల్ పిల్లలు భక్తిగీతంపై డ్యాన్స్ చేసే సందర్భం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ వీడియో చూపరుల హృదయాన్నిఆకట్టుకుంది.

వీడియో చూడండి

ఈ అద్భుతమైన వీడియోను బాగేశ్వర్ ధామ్ మహారాజ్ అని పిలవబడే పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఫ్యాన్ ఖాతా ద్వారా షేర్ చేయబడింది. అందంగా కాదు చాలా అందంగా ఉంది… ప్రతి పాఠశాలలోని పిల్లలకు అసభ్య నృత్యం కంటే ఇలాంటివి మంచివి. దైవ భక్తిని పెంచే ఇలాంటి పాటలకు నాట్యం నేర్పించాలి. జై శ్రీరామ్ అనే క్యాప్షన్ ఇచ్చారు ఈ వీడియోకు

కేవలం 30 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 45 వేలకు పైగా వీక్షించగా, వేలాది మంది ఈ వీడియోను లైక్ చేసి వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. వీడియో చూసిన తర్వాత ‘జై శ్రీరాం’ అని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..