Funny Video: అమ్మ బాబోయ్.. ఇదెక్కడి మాస్ వార్నింగ్ మావా.. ‘జంబలకిడి జారు మిఠాయా’ అని పాడుతూనే జాడిచ్చి తంతానంటోన్న చిన్నారి..

|

Jan 04, 2023 | 9:17 PM

ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పాడిన ‘జంబలకడి జారుమిఠాయ’ పాటు ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Funny Video: అమ్మ బాబోయ్.. ఇదెక్కడి మాస్ వార్నింగ్ మావా.. ‘జంబలకిడి జారు మిఠాయా’ అని పాడుతూనే జాడిచ్చి తంతానంటోన్న చిన్నారి..
Baby Girl Warning
Follow us on

ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పాడిన ‘జంబలకడి జారుమిఠాయ’ పాటు ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లలు మొదలు.. పెద్దల వరకు అందరూ ఈ పాటకు పేరడీలు, సెటైర్లు, మీమ్స్, డీజీ మిక్స్‌లు ఓస్ ఒకటేంటి.. సోషల్ మీడియా అంతా ఈ పాటతో మోతమోగిపోయింది. ఆ పాట పాడి నెలలు గడుస్తున్నా.. ఆ పాట క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఛాన్స్ దొరికితే చాలు.. ఏదో ఒక సందర్భానికి ఆ పాటను మిక్స్ చేసి సోషల్ మీడియాలో వదలేస్తున్నారు నెటిజన్లు.

తాజాగా ఓ చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చిన్నారి పాట పాడుతూనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ వింటే అమ్మ బాబోయ్ అని అనకమానరు. జనరల్‌గానే పిల్లలు చదువంటే బద్దకంగా వ్యవహరిస్తారు. చదివిందే గొప్పగా ఫీలవుతారు. కానీ, మార్కులు మాత్రం బాగా రావాలంటారు. వైరల్ అవుతున్న వీడియోలోని చిన్నారి కూడా అదే కోవకు చెందినట్లుంది. జంబలకిడి జారుమిఠాయ పాటను కాస్త మార్చి పాడుతూ రచ్చ రచ్చ చేసింది. ‘నేను చదివేస్తను చూడు.. నేను చదివేస్తను చూడు.. నాకు మార్కులు గానీ రాకపోతే నిన్ను కొట్టేస్తను చూడు జంబలకడి జారు మిఠాయా?’ అంటూ స్కూల్ టీచర్‌కే సీరియస్ వార్నింగ్ ఇచ్చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో harshitha_dolly పేరుతో ఉన్న అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. చిన్నారి పాట రూపంలో ఇచ్చిన వార్నింగ్ చూసి అమ్మ బాబోయ్.. అంటూ జడుసుకుంటున్నారు. నెటిజన్లు ఈ వీడియోకు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..