
ప్రస్తుతం సోషల్ మీడియా కాలంలో వింతలు, విశేషాలకు కొదవలేదు. అయితే, తాజాగా బీహార్ నుంచి వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. సాధారణంగా మనం ఏటీఎం కేంద్రాలకు ఎందుకు వెళ్తాం? నగదు విత్‌డ్రా చేసుకోవడానికి లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి. కానీ, బీహార్‌లో మాత్రం ఒక వ్యక్తి ఏటీఎం కేంద్రాన్ని ఏకంగా హెయిర్ సెలూన్‌గా మార్చేశాడు! దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
బీహార్‌లోని ఒక ప్రాంతంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏటీఎం లోపల ఏసీ సౌకర్యం ఉండటంతో, బయట ఉన్న ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి ఒక వ్యక్తి తన సెలూన్ సామాగ్రిని అక్కడికి మార్చేశాడు. ఏటీఎం గదిలోని అద్దాన్ని వాడుకుంటూ, అక్కడ అమర్చిన ఏసీ గాలిని ఆస్వాదిస్తూ ఒక కస్టమర్‌కు హాయిగా గడ్డం గీస్తున్నాడు. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “బీహార్‌లో ఏదైనా సాధ్యమే” అని కొందరు కామెంట్ చేస్తుంటే, “బీహార్ ప్రజల ఐక్యూ లెవల్స్ వేరే స్థాయిలో ఉంటాయి” అని మరికొందరు జోకులు పేలుస్తున్నారు. మరికొందరైతే “డబ్బులు రాకపోయినా పర్వాలేదు కానీ, క్లీన్ షేవింగ్ మాత్రం వస్తుంది” అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏటీఎం కేంద్రానికి భద్రత కల్పించాల్సిన సెక్యూరిటీ గార్డులు కూడా అక్కడ లేకపోవడంతో ఈ వింత పరిస్థితి ఏర్పడింది. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ లుక్కేయండి.