భారీ వర్షాలు, వడగళ్ళు సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాలను శీతాకాలపు వండర్‌ల్యాండ్‌గా మార్చాయి. సౌదీ అరేబియా ఎడారిని హిమపాతం ముంచెత్తింది. పర్వతాలు, లోయలు, జలపాతాలు తెల్లని మంచుతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా అల్-జాఫ్ ప్రాంతంలో ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎటు చూసిన తెల్లటి మంచు దుప్పటి కప్పేసినట్టుగా కనిపించింది. వాటిని చూసి అక్కడి పౌరులు, శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశారు. అవి వైరల్‌గా మారాయి.
సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతంలో ఈ విధంగా మంచు కురువడం ఇదే తొలిసారి. కాగా, ఎడారిప్రాంతమైన దుబాయ్‌లో భారీ వర్షాలు, మంచు కురువడంపై యూఏఈ లోని జాతీయ వాతావరణ కేంద్రం స్పందించింది. ఈ అసాధారణ వాతావరణానికి గల కారణం.. అరేబియా సముద్రం నుంచి ఒమన్ వరకు అల్పపీడనం వ్యాపించి ఉండటమేనని స్పష్టం చేసింది. ఆ కారణంగానే వాతావరణంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని వివరించింది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో అల్-జాఫ్ ప్రాంతంలో ఉరుములు, తుఫానులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురవచ్చని సౌదీ వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.
ఇక్కడ క్లిక్ చేయండి..
Snow in Saudi Arabia pic.twitter.com/ZLWHayKztT
— Yisrael official 🇮🇱 🎗 (@YisraelOfficial) November 5, 2024
సౌదీ అరేబియా మాత్రమే ఇలాంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఏకైక దేశం కాదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత అక్టోబర్ 14న, UAE జాతీయ వాతావరణ కేంద్రం ఊహించని విధంగా భారీ వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులతో కూడి వడగళ్ల వర్షం అనేక ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. రాబోయే రోజుల్లో అల్ జఫ్ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినట్లు ఖలేజా టైమ్స్ వివరించింది. అలాగే భారీ వర్షాలు, వడగళ్లు వానలు కురుస్తాయని చెప్పింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..