Sleep: హాయిగా నిద్రపోయింది.. రూ. 9 లక్షల ప్రైజ్‌ మనీ గెలుచుకుంది..

|

Sep 26, 2024 | 2:46 PM

బెంగళూరుకు శైష్వరి ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌. ఆమె తాజాగా ఓ స్టార్టప్‌నకు చెందిన స్లీప్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లో చేరారామె. నిద్ర ప్రాముఖ్యతను వివరించేందుకు, ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత బాగా నిద్రపోగలరో తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ పోటీని నిర్వహించారు...

Sleep: హాయిగా నిద్రపోయింది.. రూ. 9 లక్షల ప్రైజ్‌ మనీ గెలుచుకుంది..
Sleep
Follow us on

డబ్బులు సంపాదించాలంటే కచ్చితంగా కష్టపడాలని తెలిసిందే. ఖాళీగా కూర్చున్నా డబ్బులు వస్తే భలే ఉంటుంది కదూ! అందులోనూ హ్యాపీగా నిద్రపోయినా డబ్బులు వస్తే ఎలా ఉంటుంది.? నిద్రపోతే డబ్బులు ఎలా వస్తాయనేగా మీ సందేహం. అయితే బెంగళూరుకు చెందిన ఓ యువతి హాయిగా నిద్రపోయి రూ. 9 లక్షల ప్రైజ్‌ మనీని గెలుచుకుంది. ఇంతకీ నిద్రపోవడం వల్ల డబ్బులు ఎలా వచ్చాయి.? అసలేంటి కథ.? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

బెంగళూరుకు శైష్వరి ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌. ఆమె తాజాగా ఓ స్టార్టప్‌నకు చెందిన స్లీప్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లో చేరారామె. నిద్ర ప్రాముఖ్యతను వివరించేందుకు, ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత బాగా నిద్రపోగలరో తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ పోటీని నిర్వహించారు. ఇందులో శైష్వరితో పాటు మరో 11 మంది పాల్గొన్నారు.

పోటీలో భాగంగా రోజుకి కనీసం 8 నుంచి 9గంటల వరకూ గాఢ నిద్రపోవాల్సి ఉంటుంది. అయితే దీనిని రకరకాల స్లీప్‌ షెడ్యూళ్లను ఏర్పాటు చేశారు. అన్ని సెగ్మెంట్స్‌లో గెలిస్తే విజేతగా నిలుస్తారు. శైష్వరి ఈ పోటీలో విజయం సాధించింది. దీంతో నిర్వాహకులు ఆమెకు రూ. 9 లక్షల చెక్‌ను అందించారు. దీంతో దీనికి సంబంధించిన వార్తలు వైరల్‌ అయ్యాయి. ఎంచక్కా నిద్రపోతు డబ్బులు సంపాదించడం నిజంగానే భలే ఉంది, మాక్కూడా ఇలాంటి అవకాశం వస్తే ప్రైజ్‌ మనీ పక్కాగా కొట్టేస్తాం అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ పోటీలో విజేతగా నిలిచిన శైష్వరి మాట్లాడుతూ… శరీరం తనంతట తాను రిపేర్‌ చేసుకోవడానికి నిద్ర చాలా అవసరమని తెలిపింది. ఇలాంటి పోటీల్లో విజయం సాధించాలంటే.. క్రమబద్ధమైన నిద్రవేళలు ఏర్పరచుకోవాలన్నారు. రాత్రుళ్లు మొబైల్, టీవీల్లాంటివి చూడడం తగ్గించుకోవాలని సూచించింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..