Viral Video: సరికొత్త రికార్డును నెలకొల్పిన ఫుట్ బాల్ ఆటగాడు.. ఏకంగా 620 అడుగుల నుండి..

|

Jun 30, 2022 | 12:39 PM

రికార్డులు క్రియేట్ చేయడానికి ఎప్పుడు సాహసాలు చేస్తుంటారు కొందరు. ఎదో విధంగా తమను సమాజం గుర్తించాలని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.

Viral Video: సరికొత్త రికార్డును నెలకొల్పిన ఫుట్ బాల్ ఆటగాడు..  ఏకంగా 620 అడుగుల నుండి..
American Football
Follow us on

Viral Video: రికార్డులు క్రియేట్ చేయడానికి ఎప్పుడు సాహసాలు చేస్తుంటారు కొందరు. ఎదో విధంగా తమను సమాజం గుర్తించాలని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కొంతమంది వివియా సాహసాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ఫుట్‌బాల్‌ ఆటగాడు వినూత్న రికార్డును నెలకొల్పాడు. 620 అడుగుల నుండి విసిరిన ఫుట్‌బాల్‌ను క్యాచ్‌ పట్టుకుట్టుకుని గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నాడు. అమెరికాలో ఉన్న టస్కాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఆరిజోనా ఫుట్‌బాల్‌ స్టేడియంలో ఈ ఫీట్‌ చేశాడు ఫుట్‌బాల్‌ ఆటగాడు రాబ్ గ్రోంకోవ్‌స్కీ. హెలికాప్టర్‌ నుంచి 620 అడుగుల ఎత్తు నుంచి విసిరిన ఫుట్‌బాల్‌ను రాబ్ గ్రోంకోవ్‌స్కీ తన చేతులతో పట్టుకుని, గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు.

కాగా, గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ ఇటీవల ఈ వీడియోను తన అధికార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మరోవైపు నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్లు చేశారు. అంత ఎత్తు నుంచి క్యాచ్‌ పట్టడం చాలా ఈజీ అంటూ కామెంట్స్‌ చేస్తు్న్నారు. ఇంతకన్న ఎక్కువ హైట్‌ నుంచి ఫుట్‌బాల్ విసిరినా ఈజీ పట్టుకుంటానంటున్నారు. మరి ఈ రికార్డును ఇంకెవరైనా బీట్ చేస్తారో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి