
రిటైర్డ్ ఆర్మీ మాజీ సైనికుడు ఎస్. విజయన్ తన 4 కోట్ల విలువైన ఆస్తిని దేవతకు అంకితం చేసి ఆలయానికి విరాళంగా ఇచ్చాడు. తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలోని అరుళ్మిఘు రేణుగాంబల్ అమ్మన్ ఆలయంలో ఈ కేసు ఉంది. అక్కడ ఆలయంలోని కానుక పెట్టెను తెరిచినప్పుడు నోట్లు, నాణేలతో పాటు రెండు అసలు ఆస్తి పత్రాలు కనిపించాయి. వీటిలో ఒక ఆస్తి విలువ 3 కోట్లు, మరొకటి 1 కోటి రూపాయలు అని పేర్కొన్నారు. దీనితో పాటు ఒక లేఖ కూడా ఉండటం గుర్తించారు. అందులో విజయన్ స్వచ్ఛందంగా ఈ ఆస్తిని దేవతకు అర్పించానని రాశాడు.
అర్ని సమీపంలోని కేశవపురం గ్రామానికి చెందిన ఎస్. విజయన్ ఆలయానికి గొప్ప భక్తుడు. అతడు గత 10ఏళ్లుగా ఒంటరిగానే నివసిస్తున్నాడు. అతనికి తన భార్యతో విభేదాల కారణంగా వారు విడివిడిగా ఉంటున్నట్టుగా విజయన్ చెప్పాడు. అతని కుమార్తెలు కూడా తనను పట్టించుకోవడం లేదని వాపోయాడు. తనకు అండగా ఉండి ఆదుకున్న దేవతకు తాను తనకు ఉన్నదంతా అప్పగిస్తున్నాను అని విజయన్ అంటున్నాడు. ఇప్పుడు కుమార్తెలు ఆస్తిని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నారని, తన నిర్ణయంపై దృఢంగా ఉన్నట్టుగా విజయన్ వెల్లడించాడు.
ఆస్తి చట్టబద్ధమైన బదిలీ అవసరం అని ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎం. సిలంబరసన్ తెలిపారు. వారి వివరణ ప్రకారం కేవలం ఆస్తి పత్రాలను విరాళాల పెట్టెలో వేయడం వల్ల ఆస్తి చట్టబద్ధంగా బదిలీ చేయబడదు. రిజిస్ట్రీ విభాగంలో సరైన రిజిస్ట్రేషన్ లేకపోతే, ఆలయానికి ఆస్తిపై హక్కు లభించదు. అందువల్ల ఈ పత్రాలు ప్రస్తుతం హిందూ మత, ధర్మాదాయ దేవాదాయ శాఖ వద్ద భద్రంగా ఉంచబడ్డాయి. విరాళంగా ఇచ్చిన ఆస్తులలో ఆలయానికి సమీపంలో 10 సెంట్ల భూమి, ఒక అంతస్థుతో ఉన్న ఇల్లు ఉన్నాయి. దీని మొత్తం విలువ దాదాపు రూ.4 కోట్లు ఉంటుందని ఆలయ అధికారుల అంచనా.
అయితే, ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న విజయన్ కుమార్తెలు ఆస్తిని తిరిగి పొందాలని ప్రయత్నిస్తున్నారని చెప్పాడు. కానీ, తన నిర్ణయం నుండి వెనక్కి తగ్గనని విజయన్ స్పష్టంగా చెప్పాడు. ఆలయ నిర్వాహకులను సంప్రదించి చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేస్తానని స్పష్టం చేశాడు.. ఈ సంఘటన కేవలం కుటుంబ వివాదం కాదు, వృద్ధులు తమ సొంత పిల్లల చేతిలో అవమానించబడి, తమ జీవితంలోని చివరి మూలధనాన్ని ఏదో ఒక దైవానికి అంకితం చేసినప్పుడు ఆ భావోద్వేగ, మానసిక స్థితికి నిదర్శనంగా చెప్పాడు. . ఇప్పుడు ఈ విరాళం చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందా లేదా కుమార్తెలు దానిని తిరిగి పొందడంలో విజయవంతమయ్యారా అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..