Viral Video: రిటైర్డ్ పోలీసుకు సాటి ఉద్యోగులు ఘనమైన వీడ్కోలు .. సీనియర్ ఇన్‌స్పెక్టర్ స్వయంగా ఇంటికి డ్రైవ్ చేసిన వీడియో వైరల్..

|

Apr 02, 2023 | 8:36 AM

36 సంవత్సరాలుగా పోలీసుగా విధులను నిర్వహించిన ASI సునీల్ మోరే శుక్రవారం రిటైర్‌మెంట్‌ అయ్యారు. తన బృందం నుండి ఘనమైన వీడ్కోలు అందుకున్నారు. ఘనంగా సత్కరించారు. సాటి ఉద్యోగులు సునీల్ ను హృదయానికి హత్తుకున్నారు. పూల వర్షం కురిపించారు. చప్పట్లతో సునీల్ మోరేను అభినందించారు

Viral Video: రిటైర్డ్ పోలీసుకు సాటి ఉద్యోగులు ఘనమైన వీడ్కోలు .. సీనియర్ ఇన్‌స్పెక్టర్ స్వయంగా ఇంటికి డ్రైవ్ చేసిన వీడియో వైరల్..
Retired Police Driver
Follow us on

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమం. అయితే తమ మధ్య కొన్ని ఏళ్లుగా కలిసి పనిచేసి.. సర్వీస్ ముగించుకుని వీడ్కోలు చెప్పే ఉద్యోగికి.. తోటి ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు చెప్పిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమ సాటి ఉద్యోగి పోలీస్ వ్యాన్ డ్రైవర్ గా విధులు నిర్వహించిన ఓ ఉద్యోగికి సాటి ఉద్యోగులు హృదయపూర్వక వీడ్కోలు చెప్పారు. రిటైర్డ్ పోలీస్ డ్రైవర్‌కు గుర్తుండిపోయేలా వీడ్కోలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రిటైర్డ్ పోలీసు తాను విధులు నిర్వహిస్తే సమయంలో పోలీసు వాహనం డ్రైవ్ చేసేవారు. సీనియర్ ఇన్‌స్పెక్టర్ దగ్గర విధులను నిర్వహించేవారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో రిటైర్డ్ పోలీసుని స్వయంగా సీనియర్ ఇన్‌స్పెక్టర్ పోలీసు వాహనం లోపలికి ఎక్కించారు. అంతేకాదు అతని భార్య, కుటుంబంతో సహా పోలీసు వాహనంలో తీసుకుని ఇంటికి దగ్గర డ్రాప్ చేయడానికి సీనియర్ ఇన్‌స్పెక్టర్ చూపించిన రెస్పెక్ట్ ఫుటేజ్ ను క్యాప్చర్ చేసింది. ఈ ఘటన ముంబైలోని గామ్‌దేవి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.

36 సంవత్సరాలుగా పోలీసుగా విధులను నిర్వహించిన ASI సునీల్ మోరే శుక్రవారం రిటైర్‌మెంట్‌ అయ్యారు. తన బృందం నుండి ఘనమైన వీడ్కోలు అందుకున్నారు. ఘనంగా సత్కరించారు. సాటి ఉద్యోగులు సునీల్ ను హృదయానికి హత్తుకున్నారు. పూల వర్షం కురిపించారు. చప్పట్లతో సునీల్ మోరేను అభినందించారు. సునీల్ మోరే రిటైర్డ్ అయిన పోలీస్ స్టేషన్‌ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శశికాంత్ యాదవ్.. స్వయంగా సునీల్ ను అతని కుటుంబంతో కలిపి స్వయంగా వర్లీలోని పోలీస్ కాలనీలో ఉన్న ఇంటికి తీసుకుని వెళ్లారు. పోలీస్ శాఖలో ఎలాంటి రిమార్క్ లేకుండా పదవి విరమణ చేయడం గొప్ప విషయం.. ప్రజా రక్షణ కోసం తమ ఆరోగ్యాన్ని కూడా లేక చేయక పోలీసులు పనిచేస్తారు.. పోలీస్ శాఖకు చేసిన సేవలు ఎంత అభినందనీయమని సాటి ఉద్యోగాలు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

జర్నలిస్ట్ రాజ్ ఆన్‌లైన్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఈ క్లిప్‌ను ముంబై పోలీసుల అధికారిక హ్యాండిల్ రీట్వీట్ చేసింది. “లవ్లీ మూమెంట్,” “సీనియర్ నుండి మెచ్చుకోదగిన స్టెప్, అంటూ రకరకాల కామెంట్స్ తో తమ సాటి ఉద్యోగిపై ప్రశంసల వర్షం కురిపించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..