ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ.225 కోట్ల జాక్ పాట్ తగిలింది..

కొందరు కళ్లు మూసుకుని తాము అనుకున్నది జరగాలని మొక్కుతుంటారు.. అలాంటిదే ఒక అలవాటుతో చేసిన పని ఒక మిడిల్‌ క్లాస్‌ ఉద్యోగి తలరాతను మార్చేసింది.. రాత్రికి రాత్రే అతన్ని కోటీశ్వరుడిగా మార్చేసింది. కోటీశ్వరుడు అంటే.. అదేదో రెండు మూడు కోట్ల రూపాయలు కాదు.. ఏకంగా రూ.225కోట్లు తెచ్చిపెట్టింది.. ఇంతకీ అసలు విషయం ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే...

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ.225 కోట్ల జాక్ పాట్ తగిలింది..
Sriram Rajagopalan

Updated on: May 25, 2025 | 6:44 PM

సాధారణంగానే చాలా మంది కొన్ని వింత ఆటలు అలవాటుగా ఉంటాయి. కొందరు దూరంగా ఉన్న కప్పులో రాళ్లు వేస్తూ మనసులో తమ కోరికలు చెప్పుకుంటారు.. అలాగే, కొందరు చేతి వేళ్లను తాకితే తమ కోరిక తీరుతుందో లేదో పరీక్షించుకుంటారు. అలాగే, ఇంకొందరు కళ్లు మూసుకుని తాము అనుకున్నది జరగాలని మొక్కుతుంటారు.. అలాంటిదే ఒక అలవాటుతో చేసిన పని ఒక మిడిల్‌ క్లాస్‌ ఉద్యోగి తలరాతను మార్చేసింది.. రాత్రికి రాత్రే అతన్ని కోటీశ్వరుడిగా మార్చేసింది. కోటీశ్వరుడు అంటే.. అదేదో రెండు మూడు కోట్ల రూపాయలు కాదు.. ఏకంగా రూ.225కోట్లు తెచ్చిపెట్టింది.. ఇంతకీ అసలు విషయం ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే…

చెన్నైకి చెందిన ఒక రిటైర్డ్ ఇంజినీర్ కళ్లు మూసుకొని కొట్టిన నెంబర్లు అతనికి రూ.225 కోట్లు వచ్చి పడేలా చేసింది. దీంతో అతడు తనకు వరించిన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయాడు. ఇది నిజంగానే జరిగిందా..? అనే ఆశ్చర్యంలో ఉండిపోయాడు. చెన్నైకి చెందిన రిటైర్డ్ ఇంజినీర్ శ్రీరామ్ రాజగోపాలన్‌ను అనుకోని అదృష్టం వరించింది. యూఏఈకి చెందిన ‘ఎమిరేట్స్ డ్రా’లో ఏకంగా రూ.225 కోట్ల జాక్‌పాట్ కొట్టారు.

శ్రీరామ్ రాజగోపాలన్‌కు ఒక సాధారణ ఫోన్ ట్యాప్ అలవాటు ఉండేది. అలాంటి అలవాటే అతడి తలరాతను మార్చివేసింది. యుఎఈ లాటరీ చరిత్రలో ఒక భారతీయుడు ఇంతటి భారీ బహుమతి గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని ఎమిరేట్స్ డ్రా సంస్థ మే 22 గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. కాగా, శ్రీరామ్ 1998లో సౌదీ అరేబియాకు వెళ్లి స్థిరపడ్డారు. 2023లో రిటైరై ఇండియాకు వచ్చేశారు. భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. మార్చి 16న తన పుట్టినరోజు సందర్భంగా లాటరీ టికెట్ కొన్నానని, ఇంత భారీ మొత్తం వస్తుందని ఊహించలేదని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

డాలర్లలో లాటరీ గెలిచిన శ్రీరామ్, తన గెలుపులో కొంత భాగాన్ని ఛారిటీకి విరాళంగా ఇస్తానని చెప్పాడు. ఇది నా కుటుంబానికి ఆశను ఇచ్చింది. ఈ డబ్బు పిల్లల భవిష్యత్తుకు దృఢమైన పునాది వేయడానికి సహాయపడుతుందని శ్రీరామ్ అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..