
భూమిపై మొత్తం ఏడు ఖండాలు ఉన్నాయని చిన్నప్పటి నుండి మనందరం చదువుకున్న విషయమే. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా. కానీ ఈ జాబితా ఇప్పుడు మారిపోనుంది.! ఎందుకంటే శాస్త్రవేత్తలు గ్రీన్లాండ్ మంచు పలక కింద దాగి ఉన్న ‘సూక్ష్మ ఖండం’ ఒకటి కనుగొన్నారు. ఇది కెనడా, గ్రీన్లాండ్ మధ్య డేవిస్ స్ట్రెయిట్ అనే సముద్ర ప్రాంతంలో కనుగొనబడింది.
ఈ తెలియని ఖండాన్ని డేవిస్ స్ట్రెయిట్ ప్రోటో మైక్రోకాంటినెంట్ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతం దాదాపు 58 మిలియన్ సంవత్సరాల పురాతనమైనదని చెబుతున్నారు. గ్రీన్లాండ్, కెనడా మధ్య టెక్టోనిక్ ప్లేట్లు విడిపోతున్నాయి. కానీ,ఈ ఖండం పూర్తిగా విడిపోలేకపోయింది. దాంతో సముద్రపు లోతుల్లో మంచు పలక కింద ఈ ఖండం అలాగే దాక్కుంది. గ్రీన్లాండ్ ప్రపంచంలోని అత్యంత శీతల ప్రాంతాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇంత పెద్ద భూభాగంలో ఒక రకమైన ఖండం అక్కడ చాలా సంవత్సరాలుగా అంతర్లీనంగా దాగి ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు.
ఈ అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. పరిశోధకులు దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ఆవిష్కరణ భౌగోళిక శాస్త్రం, భూమి చరిత్రపై మన అవగాహనను మారుస్తుందని మాత్రం శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెబుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..