Viral News: ఎలా పెంచావ్ అక్క.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు గల మహిళ.. ఎన్ని అడుగులో తెలిస్తే..

ప్రస్తుత రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతుంటే, ఇక్కడొక మహిళ మాత్రం ఏకంగా జుట్టు పెంచడంలో గిన్నిస్ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన మహిళగా 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో తన పేరును నమోదు చేసుకుంది. ఇంతకీ ఆమె జుట్టు పొడవు ఎంతో తెలుసుకుందాం రండి.

Viral News: ఎలా పెంచావ్ అక్క.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు గల మహిళ.. ఎన్ని అడుగులో తెలిస్తే..
World's Longest Hair Woman

Updated on: Aug 08, 2026 | 2:52 PM

మనం తినే ఆహారం, మారిన జీవనశైలి కారణంగా చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఊడుతున్న జుట్టును కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కానీ, ఇక్కడొక మహిళ మాత్రం ఏకంగా తన జుట్టును పెంచి గిన్నిస్ రికార్డు సాధించింది. ఆమె ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రేణు దరియాల్. యూట్యూబర్ అయిన ఈమె తన జుట్టును సుమారు 271.50 సెంటీమీటర్లు (అంటే 8 అడుగుల 10 అంగుళాలు) పెంచి గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈమె చేసే యూట్యూబ్ వీడియోలు చూసిన గిన్నిస్ బుక్ నిర్వాహకులు ఆమెను సంప్రదించి, గతేడాది ఏప్రిల్‌లో జుట్టును అధికారికంగా కొలిచారు. అప్పట్లో ఆమె జుట్టు పొడవు 257.33 సెంటీమీటర్లు ఉండటంతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన మహిళగా ఆమెను గుర్తించారు. దీంతో ఆమె పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేర్చారు.

ఈ సరికొత్త రికార్డుతో రేణు.. ఇప్పటివరకు ఉక్రెయిన్ దేశానికి చెందిన అలియా నసిరోవా పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. ఈ సందర్భంగా రేణు మాట్లాడుతూ.. తాను 2015 నుండి జుట్టును పెంచుతున్నానని, పొడవైన జుట్టు అనేది భారతీయ సంస్కృతిలో సంప్రదాయానికి ప్రతీకగా, అందానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.

గిన్నిస్ బుక్‌ రికార్డ్ వారి పోస్ట్ ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us