Viral News: జాలర్ల వలకు చిక్కిన అరుదైన చేపలు.. ఎంత ధర పలికాయో తెలిస్తే ఫ్యూజులు ఔట్!

|

Jan 31, 2022 | 5:59 PM

అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది. దురదృష్టం తలుపు తీసే దాకా తడుతూనే ఉంటుంది. ఈ సామెత మీరు వినే ఉంటారు...

Viral News: జాలర్ల వలకు చిక్కిన అరుదైన చేపలు.. ఎంత ధర పలికాయో తెలిస్తే ఫ్యూజులు ఔట్!
Telia Bhola Fishes
Follow us on

అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది. దురదృష్టం తలుపు తీసే దాకా తడుతూనే ఉంటుంది. ఈ సామెత మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.? అదృష్టం అనే కాయిన్ మీవైపు తిరిగినప్పుడు దాన్ని ఒడిసి పట్టుకోవాలి. అలా చేసి చాలామంది ఓవర్ నైట్‌లోనే ధనవంతులు అయ్యారు. ఇదిలా ఉంటే.. సముద్రం తనలో ఎన్నో సంపదలు దాచుకుంటుంది. వాటి వల్ల అనేకసార్లు మత్స్యకారులు ధనవంతులు అయ్యారు. సరిగ్గా ఇలాంటిదే ఒకటి పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నపూర్ దిఘాకు చెందిన ఓ మత్స్యకారుడికి జరిగింది.

మనోరంజన్ ఖండా అనే మత్స్యకారుడు ఇటీవల చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళగా.. 121 అత్యంత అరుదైన తేలియా భోలా చేపలు చిక్కాయి. వీటిని అతడు మార్కెట్‌లో అమ్మితే.. సుమారు రూ. 2 కోట్లు వచ్చాయి. ఈ తేలియా భోలా చేపలలో విలువైన ఔషధ గుణాలు ఉంటాయని.. అలాగే ఈ చేపల మూత్రాశయంలో ఉత్పత్తి అయ్యే లివర్ ఆయిల్‌తో పలు రకాల ఔషధాలను తయారీ చేస్తారని స్థానిక మత్స్యకారులు చెప్పుకొచ్చారు. ఈ జాతికి చెందిన సముద్రపు లోతులో ఉంటాయట.