Viral: చేపల కోసం వేసిన వల బరువెక్కినట్టుగా అనిపించింది.. గంపెడు ఆశతో పైకి లాగి చూడగా

చేపల కోసం వేసిన వల ఒక్కసారిగా బరువెక్కింది. దెబ్బకు సంతోషంలో మునిగిపోయారు జాలర్లు.. భలేగా భారీ చేపలు పడి ఉంటాయిలే అనుకునేరు.. ఆ వలను పైకి లాగి చూడగా షాక్ అయ్యారు.. ఇంతకీ ఆ వివరాలు.. ఓసారి స్టోరీపై లుక్కేయండి మరి.

Viral: చేపల కోసం వేసిన వల బరువెక్కినట్టుగా అనిపించింది.. గంపెడు ఆశతో పైకి లాగి చూడగా
Fishing Net

Updated on: Oct 17, 2025 | 12:16 PM

ఒడిశా-పశ్చిమ బెంగాల్ సరిహద్దు వెంబడి దిఘా సమీపంలో ఓ జాలరికి భారీగా చేపలు చిక్కాయి. ఆదివారం ఉదయం ఆ ప్రాంతంలో చేపలు పట్టేందుకు ఓ మత్స్యకారుడు వెళ్లగా.. అతడి వలలో 90 భారీ ‘టెలియా భోలా’ చేపలు పడ్డాయి. చిక్కిన ఒక్కో చేప 30 నుంచి 35 కిలోగ్రాముల బరువు ఉంటుందని.. మొత్తంగా ఆ చేపలు వేలంలో దాదాపుగా రూ. కోటికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. దిఘా చేపల మార్కెట్ వద్ద ఈ అరుదైన టెలియా భోలా చేపలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

కోల్‌కతాకు చెందిన ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఈ అరుదైన 90 చేపలను కొనుగోలు చేసింది. వాటిల్లో ఉండే అధిక ఔషధ గుణాలు కారణంగా సదరు కంపెనీ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. టెలియా భోలా చేప నూనె, ఇతర శరీర భాగాలు ప్రాణాలను రక్షించే మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ జాతి చేపలను విదేశాలకు కూడా ఎక్కువగానే ఎగుమతి చేస్తారు.

టెలియా భోలా సాధారణంగా లోతైన సముద్రపు నీటిలో కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ చేపల విలువ దాని పరిమాణం, బరువు ఆధారంగా నిర్ణయిస్తారట. గత సంవత్సరం, దాదాపు 1.99 క్వింటాళ్ల బరువున్న తొమ్మిది అరుదైన చేపలు ఇదే ప్రాంతంలో లభించగా.. వాటిని దాదాపు రూ.15 లక్షలకు అమ్మారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులోనే దుకాణం పెట్టేశారుగా.. సీన్ కట్ చేస్తే