
మధ్యప్రదేశ్ ఛత్తర్‌పూర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. నౌగావ్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఫుడ్ తినలేక.. కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడుతూ ఆసుపత్రికి వచ్చాడు. పరీక్షలు చేసిన డాక్టర్లు అతని కడుపులో బాటిల్ ఉందని గుర్తించారు. అది నోటిద్వారా కాదు, మలద్వారం ద్వారా లోపలికి వెళ్లిందని బాధితుడు డాక్టర్లు చెప్పాడు. కీటకాలు పోవడానికి మందు వాడుతుండగా ఇలా జరిగిందని వివరించాడు. పేగుల ద్వారా క్రమంగా పైకి కదిలి, ఆ బాటిల్ కడుపులోకి చేరిపోయింది. ఎక్స్‌రేలో ఈ విషయం స్పష్టమవడంతో వెంటనే శస్త్రచికిత్స చేశారు. డాక్టర్ మనుజ్ చౌధరి, డాక్టర్ ఆషిష్ శుక్లా, డాక్టర్ నందకిశోర్ జటావ్, డాక్టర్ శ్రీష్టి శ్రీవాస్ నేతృత్వంలోని టీమ్ జాగ్రత్తగా బాటిల్‌ను బయటకు తీశారు.
ఆపరేషన్ తర్వాత రోగి సురక్షితంగా కోలుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వైద్యులను అభినందించారు. “ఇలాంటి వింత కేసులు మేము ఇంతకు ముందు కూడా చూశాం. సమయానికి చికిత్స చేయడం వల్ల రోగి ప్రాణం నిలిచింది” డాక్టర్లు చెప్పారు. గతంలో తాము ఓ రోగి కడుపులోంచి సొరకాయ, మరో ఇద్దరు రోగుల కడుపుల నుంచి ప్లాస్టిక్ బాటిళ్లు తీసి ప్రాణాలు కాపడినట్లు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..