ప్రపంచం మొత్తం ఎన్నో వింతలతో నిండి ఉంది.. ఇప్పటికీ.. భూమిపైనున్న కొన్ని రహస్యాలను మానవులు ఛేదించలేకపోయారు. అనేక జీవులు ప్రకృతితో మమేకమై ఉన్నాయి.. ఇప్పటికే.. కనిపించే కొన్ని జీవులు మనందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. అలాంటి జీవులు సముద్రంలో కూడా ఉన్నాయి. సముద్రంలో దాగున్న రహాస్యాలను కనుగొనేందుకు చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ రహస్యాల నిధుల్లో కొన్ని మాత్రమే బయటపడుతున్నాయి. ఈ రహస్యాల అన్వేషణలో పరిశోధకులు సముద్రంలో కొన్ని వందల, వేల కిలోమీటర్ల మేర నీటిలోకి వెళ్లారు. ఇప్పటికీ కొన్ని రహస్యాలను మాత్రమే కనిపెట్టగలిగారు.. ఇంకా బొలెడన్నీ అలాగే మిగిలిపోయాయి. దాని కోసం నిరంతరం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. క్రమంలో కనిపించినవే జెల్లీ ఫిష్‌లు.. చేపల జాతుల్లో ఇవి కూడా ఒకటి..
తాజాగా.. జెల్లీ ఫిష్ జాతికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రత్యేకమైన జెల్లీ ఫిష్ నీలం రంగులో ఉంది. ఇవి ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా తీరంలో సముద్రానికి 4,000 అడుగుల దిగువన ఈ జెల్లీ ఫిష్ కనిపించింది. ఇది చాలా అరుదుగా కనిపిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో @HowThingsWork_ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. “ఈ అద్భుతమైన అరుదుగా కనిపించే జెల్లీ ఫిష్ మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా తీరంలో సముద్రానికి 4,000 అడుగుల దిగువన కనిపించింది.’’ అంటూ క్యాప్షన్‌లో పేర్కొన్నారు.
This spectacular rarely seen jellyfish was spotted 4,000 feet below the sea off the coast of Baja California, Mexico. ? pic.twitter.com/wPypT6eoPF
— H0W_THlNGS_W0RK (@HowThingsWork_) January 21, 2023
దీనిని చూస్తుంటే.. ఇంకా మనం సముద్రపు ఉపరితలం ముగింపునకు చేరుకోలేదని భావించవచ్చు. ఈఫిల్ టవర్, ఎవరెస్ట్ పర్వతం వంటి నేలపై ఉన్న కొన్ని అతిపెద్ద ఎత్తైన ల్యాండ్‌మార్క్‌లతో పోలిస్తే.. సముద్రపు లోతును చూపించే అనేక అధ్యయనాలు వచ్చాయి. కానీ, ఇంకా వీటికి సంబంధించి స్పష్టమైన అధ్యయనాలు ఇంకా రావాల్సి ఉంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..