Viral: చేపల కోసం వేసిన వల బరువెక్కింది.. దాన్ని పైకి లాగి చూడగా.. కాసుల పంట

|

Apr 26, 2024 | 7:42 AM

వలలో చిక్కిన చేపతో ఈ జాలరి సుడి తిరిగిపోయింది. ఒకచోట స్థిరంగా ఉండని.. గుంతల్లో పెరిగే ఈ చేపల్లో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే అదంటే అంత డిమాండ్. ఈ చేప రెక్కలు గరుకుగా, చిన్నగా ఉంటాయి. ఆపరేషన్‌ తర్వాత కుట్లు వేసేందుకు వాడే దారాన్ని ఈ చేప పొట్ట భాగం నుంచే తయారు చేస్తారట. సౌందర్య సాధనాలు, పలు రకాల మందుల తయారీలోనూ వినియోగిస్తారు. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టే ఈ సీ గోల్డ్‌ ఫిష్‌.. అంత ధర పలుకుతోంది. ఎప్పుడు, ఎక్కడ దొరికినా సంచలనం అవుతుంది.

Viral: చేపల కోసం వేసిన వల బరువెక్కింది.. దాన్ని పైకి లాగి చూడగా.. కాసుల పంట
Fishermen (Representative image)
Follow us on

లక్ కలిసిరావడం అంటే ఇదే అనుకుంటాను. సాధారణంగా జాలర్లు వేటకు వెళ్తే.. చేపలు, పీతలు, రొయ్యలు వంటివి చిక్కుతుంటాయి. వాటిని అమ్మి జీవనం సాగిస్తూ ఉంటారు. కానీ కొన్ని అరుదైన సందర్బాల్లో.. అత్యంత అరుదైన చేపలు చిక్కుతుంటాయి. అవి కాసుల పంటను తెచ్చిపెడతాయి. సుడి బాగుంటే 3 నుంచి 4 నెలలు కష్టపడితే వచ్చే ఆదాయం.. ఒక్క రోజులో వచ్చిపడుతుంది. తాజాగా చెన్నై తంజావూరులో ఓ మత్స్యకారుడికి అలాంటి లక్కే తగిలింది. అదిరంపట్టినం ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు రవి ఇటీవల సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. వల వేసి బయటకు లాగిన తర్వాత.. అతడు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అందుకు కారణం.. ఆ వలలో చిక్కిన గోల్డ్ ఫిష్. అదేనండి కచిడి చేప. అది కూడా 25 కేజీల బురువుంది. ఇంకేముంది తన పంట పండిదని ఆనందపడ్డాడు.  ‘ప్రోటోనిబియా డయాకాంతస్’ అనేది ఈ చేప శాస్త్రీయ నామం. బ్లాక్‌స్పాటెడ్ క్రోకర్ అని కూడా పిలుస్తారు.

కచిడి చేపను వేలం వేసేందుకు మార్కెట్‌కు తీసుకొచ్చాడు రవి. ఇది చాలా అరుదుగా చేప అవ్వడంతో, కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఎగబడ్డారు. రూ.1000తో ప్రారంభమైన చేప వేలం ఎట్టకేలకు రూ.1,87,770కి వద్ద ముగిసింది. ఈ చేప సాధారణంగా గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రా తీర ప్రాంతాలలో కనిపిస్తుంది. తమిళనాడు తీరంలో ఈ చేపలు చాలా అరుదుగా కనిపిస్తాయని స్థానిక మత్స్యకారులు తెలిపారు.

ఈ చేప గాల్ బ్లాడర్‌ని శస్త్రచికిత్స దారాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. సింగపూర్‌లో, ఖరీదైన వైన్లను శుభ్రం చేయడంలో ఈ చేప రెక్కలను వాడతారట. దాని మాంసాన్ని సౌందర్య సాధనాల తయారీకి ఉపయోగిస్తారు. మందుల తయారీలోనూ దీని భాగాలను ఉపయోగిస్తారని పేర్కొన్నారు. ఈ చేపలకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు.  (Source)

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..