సాంప్రదాయ మత్స్యకారుల జీవితం ప్రతీ రోజూ ఓ పోరాటమే. గంపెడు ఆశలతో ఒక్కసారి నడి సముద్రంలోకి వెళ్తే.. వలకు దండిగా చేపలు చిక్కితేనే గానీ తిరిగి ఒడ్డుకు రారు. ఒక్కోసారి వారం రోజులైనా కూడా తీరానికి తిరిగొచ్చే పరిస్థితి ఉండదు. ఇంకొన్ని సార్లయితే వలకు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. ఇక ఇదే తరహాలో కర్ణాటకలోని మల్పెకి చెందిన పలువురు జాలర్ల వలకు ఓ అరుదైన చేప చిక్కింది.
అసలు విషయానికొస్తే.. కర్ణాటకలోని మల్పె ప్రాంతంలో పలువురు జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లగా.. వారి వలకు అరుదైన జాతికి చెందిన రంపపు చేప(Saw Fish) చిక్కింది. సుమారు 250 కేజీల బరువున్న ఈ చేపను జాలర్లు బోటులో ఒడ్దుకు తీసుకొచ్చి లారీ ద్వారా మంగళూరుకు తరలించారు. ఈ చేప నోరు 10 అడుగుల పొడువైన రంపం లాగ ఉంది. దీనిని చూసేందుకు స్థానికులు బారులు తీరగా.. ఈ రంపపు చేపకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ జాతికి చెందిన చేపలు అంతరించే దిశకు చేరుకున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ రంపపు చేపను డీప్ సీ ఫిషింగ్ బోట్ ‘సీ కెప్టెన్’లో మత్స్యకారులు పట్టుకున్నారు. దీనిని మల్పె ఫిషరీస్ హార్బర్‌కు తీసుకొచ్చి మంగళూరు వ్యాపారికి విక్రయించినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ గణేష్ జాతీయ మీడియాకు వెల్లడించారు.
An extremely rare & endangered species of carpenter shark (sawfish) was caught in fishnets at Malpe on Thursday. ?
The huge carpenter shark weighed around 250 kgs, was accidentally trapped in the nets of a boat named ‘Sea Captain’ that had left Malpe port to fish in deep waters pic.twitter.com/3AimndOv1I
— Mangalore City (@MangaloreCity) March 12, 2022