Viral Video: ఓట్ల పండగ వచ్చేసింది.. ఓటరు దేవుడి ప్రసన్నం కోసం సాష్టాంగ నమస్కారం చేస్తున్న అభ్యర్థి.. వైరలవుతున్న వీడియో

|

Aug 26, 2022 | 4:21 PM

ఊహించని రేంజిలో హామీలు కురిపించడం.. మాటలతోనే అభివృద్ధిని కళ్లకు కట్టినట్లుగా చూపించడం చేసి ఓటర్లను తమ వైపుకు తిప్పుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది..

Viral Video: ఓట్ల పండగ వచ్చేసింది.. ఓటరు దేవుడి ప్రసన్నం కోసం సాష్టాంగ నమస్కారం చేస్తున్న అభ్యర్థి.. వైరలవుతున్న వీడియో
Student Union
Follow us on

Funny video: ఎన్నికలొచ్చాయంటే.. రాజకీయ నాయకులందరూ.. ప్రజల వాకిళ్లలో వాలిపోతుంటారు.. ఎన్నికలకు ముందు కనీసం ప్రజల వంక కన్నెతి కూడా చూడని నాయకులు.. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిందంటే చాలు ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తుంటారు. అంతే కాకుండా ఓటర్లను ఆకర్షించడానికి చిత్రవిచిత్రమైన పనులు చూస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు రాజకీయ నాయకులు చేసే పనులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఎక్కువగా అయితే ఊహించని రేంజిలో హామీలు కురిపించడం.. మాటలతోనే అభివృద్ధిని కళ్లకు కట్టినట్లుగా చూపించడం చేసి ఓటర్లను తమ వైపుకు తిప్పుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది..

రాజస్థాన్‌లోని యూనివర్సిటీలు, కాలేజీల్లో స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, స్టూడెంట్స్‌ యూనియన్‌ ఎన్నికలు కూడా రాజకీయ ఎన్నికలను మించిపోయి కనిపిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా అభ్యర్థులు ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ రాజస్థాన్ స్టూడెంట్ యూనియన్ ఎన్నికలకు సంబంధించిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పోటీలో నిలబడిన వ్యక్తి ఓటరును ఎలా కాకా పడుతున్నాడో.. అందుకోసం అతడు చేస్తున్న వింత చేష్టలను ఈ వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి, కరోనా మహమ్మారి కారణంగా, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించలేదు.. ఈ ఏడాది మళ్లీ ప్రక్రియ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో వైరల్ అవుతోంది, ఇది భరత్‌పూర్ జిల్లాలోని ఒక కళాశాలకు సంబంధించినదిగా తెలుస్తుంది. ఈ వైరల్ వీడియోలో…

ప్రతి విద్యార్థి అది ఒక అబ్బాయి లేదా అమ్మాయి రోడ్డుపై వెళుతున్నప్పుడు.. అభ్యర్థి వారిని అడ్డుకుని రోడ్డుపై నమస్కరించి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అంతేకాదు.. రోడ్డుపై నిలువునా పడుకుని ఓటరు పాదాలను పట్టుకుని ఓటు వేయమని వేడుకున్నారు. అదే సమయంలో అమ్మాయి తన కాళ్లను విడిపించుకునే ప్రయత్నం చేయటం కనిపిస్తుంది. తమ్ముడు.. సరే నేను నీకే ఓటేస్తాను.. ఇప్పుడునా కాళ్లు వదిలేయ్‌ అంటూ విడిపించుకునేందుకు ప్రయత్నించింది.

ఆగస్టు 27న ఎవరి అదృష్టం ఎలా ఉంది. ఎవరి ఆశీర్వాదం ఫలిస్తుంది అనేది తేలనుంది. అసలు శుక్రవారం కళాశాలలో ఓటింగ్‌ ఉండగా, అభ్యర్థులు తమ చివరి బలాబలాలను తేల్చుకోవడానికి ఓటు వేయడానికి వస్తున్న విద్యార్థులందరినీ కాళ్లు పట్టుకుంటున్నారు. ఓటు వేస్తామని విద్యార్థులు భరోసా ఇచ్చేంత వరకు తమ కాళ్లను వదిలిపెట్టకుండా పట్టేసుకుంటున్నారు.

భరత్‌పూర్‌లోని విద్యార్థి సంఘానికి 12 కళాశాలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆగస్టు 27న ఓట్ల లెక్కింపు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత గెలిచిన అభ్యర్థికి విద్యార్థుల ఆశీస్సులు ఏ మేరకు ఫలించాయి. గెలిచిన నేత ఏ హామీ నెరవేరుస్తాడు అన్నది చూడాల్సి ఉంది.

మరిన్నిట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి