Viral: తవ్వకాలు జరుపుతున్న కూలీలకు కలిసివచ్చిన అదృష్టం.. మెరుస్తూ కనిపించిన నాణేలు.. కానీ

|

Sep 18, 2022 | 6:15 PM

నిర్మాణ పనులు చేస్తున్న కూలీలకు పురాతన నాణేలుకంటపడటంతో ఎంతో సంబరపడ్డారు. కానీ వారి ఆనందం ఎంతోసేపు నిలువలేదు.

Viral: తవ్వకాలు జరుపుతున్న కూలీలకు కలిసివచ్చిన అదృష్టం.. మెరుస్తూ కనిపించిన నాణేలు.. కానీ
Antique Coins
Follow us on

hidden treasure: ఒక నిర్మాణ స్థలంలో తవ్వకాలు జరుపుతున్న కూలీలకు.. దాదాపు 50 పురాతన నాణేలు లభించాయి. దీంతో వారు సంబరపడిపోయారు. తమకు అదృష్టం కలిసివచ్చిందని మురిసిపోయారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఈ విషయం గుప్పమనడంతో.. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని దొరికిన నాణేలను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌(Rajasthan) రాజధాని జైపూర్‌(Jaipur)కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జామ్వా రామ్‌గఢ్ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. అయితే, ఈ నాణేలు ఏ లోహంతో తయారు చేశారు..?.. ఏ రాజ్యానికి చెందినవి.. ఎప్పుడు ముద్రించారు అనే వివరాలు తెలియరాలేదు.  “పాత నాణేల రికవరీ గురించి గ్రామస్తుల నుండి మాకు గురువారం సమాచారం అందింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని రాష్ట్ర పురావస్తు శాఖకు సమాచారం అందించాం. జైపూర్ అధికారులు వచ్చి ఈ నాణేలను పరిశీలిస్తారు. అప్పటి వరకు వాటిని ఖజానాలో భద్రంగా ఉంచుతాం” అని స్థానిక తహసీల్దార్ రాకేష్ మీనా తెలిపారు. కాగా గ్రామంలో పురాతన కరెన్సీ దొరకడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉపాధి హామి పనులు చేస్తున్న కార్మికులకు మట్టికుండలో దాచిన 82 నాణేలు దొరికాయి. (Source)

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..